చాలా శాతం మంది స్పీట్స్ ను ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే ఎటువంటి తీపి పదార్థాలైన ఇష్టపడేది మనుషులు మాత్రమే కాదు చీమలు కూడా తీయటి పదార్థాలను ఎంతో ఇష్టపడతాయి. సహజంగా ఇంట్లో ఒక్క పలుకు పంచదార కింద పడితే క్షణంలో చీమలు అన్ని వచ్చి చేరుతాయి. అయితే ఈ విధంగా చక్కెర కింద పడిన కొద్ది సమయానికి అవి చేరుతాయి. ఇలా చాలా సందర్భాలలో ఎంతో త్వరగా ఎలా వచ్చాయి అని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. అందుకే చాలా శాతం మంది వంట గదిలో చీమలు రాకుండా ఎన్నో రకాల చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు.
పంచదార అనేది ఒక హై ఎనర్జీ ఫుడ్. చీమలు సహజంగా ఆహారాన్ని సేకరిస్తూ ఉంటాయి మరియు గూళ్ళను నిర్మించడం కోసం ఎంతో కష్టపడతాయి. ఈ విధంగా శ్రమించినప్పుడు వాటికి ఎన్నో క్యాలరీలు అవసరం. అందువలన చీమలు హై క్యాలరీ ఫుడ్ అయిన పంచదారను ఎక్కువగా తింటాయి. ఈ విధంగా చక్కెరను తీసుకోవడం వలన ఎంతో ఎనర్జీని అవి పొందుతాయి. దాంతో చీమలు కష్టపడి పనిచేయడానికి అవసరమైన ఎనర్జీ ను పొందుతాయి. అందువలనే పంచదారని చూసి చీమలు ఎంతో త్వరగా చేరుతాయి. అయితే చీమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇంటి బయట కాఫీ పొడిని చల్లడం వలన చీమలు రాకుండా ఉంటాయి.
అంతేకాకుండా వంటగదిలో బిర్యానీ ఆకులను పెట్టడం వలన చీమలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. బిర్యానీ ఆకుల వాసనను చీమలు ఇష్టపడవు దీంతో అవి రాకుండా ఉంటాయి. అంతేకాకుండా దోసకాయల తొక్కలను ఇంటి బయట మరియు తలుపులు దగ్గరలో పెట్టడం వలన చీమలు రాకుండా ఉంటాయి. వీటితో పాటుగా దాల్చిన చెక్క, పుదీనా, నారింజ వంటి పదార్థాలు ఉపయోగించి తయారుచేసిన ఎసెన్షియల్ ఆయిల్స్ ను ఉపయోగించి చీమలను రాకుండా చేయవచ్చు. 20 చుక్కల ఆయిల్ ని 8 ఔన్స్ ల నీటితో కలిపి ఈ మిశ్రమాన్ని తలుపులు, కిటికీలు వంటి మొదలైన ప్రదేశాలలో పెట్టడం వలన చీమలు రాకుండా ఉంటాయి.