“సగం గడ్డం సగం మీసం” ఛాలెంజ్… క్రికెటర్‌ దిగ్గజం జాక్ కల్లిస్…!

-

అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకునే విదేశీ క్రికెటర్లు అంతరించిపోతున్న అడవి జంతువులను కాపాడే పనిలో పడిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ నుంచి కెవిన్ పీటర్సన్… సౌత్ ఆఫ్రికా జట్టు నుంచి దిగ్గజ ఆటగాడు జాక్ కల్లిస్… అంతరించిపోతున్న ఖడ్గ మృగాల కోసం పోరాడుతున్నాడు. ఇక కంటికి గాయ౦తో క్రికెట్ నుంచి తప్పుకున్న… మార్క్ బౌచర్ కూడా వాటి కోసం పోరాడుతున్నారు. తమ సోషల్ మీడియా ఖాతాలో వాటికి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వాటిని కాపాడాలి అంటూ పిలుపు ఇస్తున్నారు. వీటికి మంచి స్పందన వస్తుంది.

తాజాగా జాక్ కల్లిస్ ఒక ఛాలెంజ్ మొదలుపెట్టాడు. అంతరించిపోతున్న రైనోల కోసం గానూ… సగం షేవ్ తో కనిపించాడు కల్లిస్. ఒక చాలెంజ్‌లో భాగంగా తన మీసం గడ్డం సగమే చేసుకున్నాడు. సేవ్ ది రైనో అనే ఛాలెంజ్ ని స్వీకరించి ఈ విధంగా తన వాహనంలో ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇప్పుడు అది వైరల్ గా మారింది. అతని ఫాన్స్ భారీగా స్పందిస్తున్నారు… మీతో మేము కూడా చేతులు కలుపుతామని… వాటి సంరక్షణ కోసం మీతో కలిసి నడుస్తామని అతని పోస్ట్ కి వాళ్ళు రిప్లయ్ ఇస్తున్నారు.

ఇక సఫారి జట్టు నుంచి అతను క్రికెట్ దిగ్గజంగా ఎదిగాడు. ప్రపంచ దిగ్గజ ఆటగాళ్ళలో కల్లిస్ ముందు వరుసలో ఉంటాడు. మంచి ఆల్ రౌండర్ గా గుర్తింపు పొందిన కల్లిస్ తన కెరీర్ లో 328 వన్డేలతో పాటు కెరీర్‌లో 166 టెస్టులు ఆడాడు. వన్డేల్లో 11,579 పరుగులు చేసిన కల్లిస్ టెస్టుల్లో 13,289 పరుగులు చేసి ఆ జట్టుకి వెన్నుముకగా నిలిచాడు. ఇక ఐపియల్ లో కోల్కతా నైట్ రైడర్స్ తరుపున అతను ఆడాడు. వన్డేల్లో 273 వికెట్లను, టెస్టుల్లో 292 వికెట్లు అతని ఖాతాలో వేసుకున్నాడు. అతనికి సౌత్ ఆఫ్రికా కపిల్ దేవ్ గా పేరుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version