నవరాత్రి పండుగ కేవలం ఉపవాసాలు రంగులకే పరిమితం కాదు. ఇది శక్తిని స్త్రీత్వాన్ని గౌరవించే గొప్ప సమయం. ఈ తొమ్మిది రాత్రులలో జరిగే ముఖ్యమైన వేడుకల్లో ఒకటి కన్య పూజ. ఎందుకంటే దేవిని బాలికల రూపంలో పూజించడం వెనుక మనసుకు ప్రశాంతత, అదృష్టాలు కలగాలని కోరుకుంటూ చేస్తారు. పసిపిల్లలలో మనం పరమేశ్వరి రూపాన్ని చూస్తాం. ఈ ఆచారం యొక్క నిజమైన ఆధ్యాత్మిక లోతును అర్థం చేసుకుందాం. ఇది మనిషికి మానవత్వం ధైర్యం అనురాగం పెంచుతుందని విశ్వసించే రహస్యం.
కన్య పూజ అనేది బాలికల రూపంలో ఉన్న దేవిని ఆరాధించే ఆచారం. సాధారణంగా తొమ్మిది మంది బాలికలను (రెండు నుండి పది సంవత్సరాల వయస్సు వారిని) దేవికి ప్రతిరూపంగా భావిస్తారు. ఈ బాలికల పాదాలు కడిగి కొత్త దుస్తులు ధరింపజేసి నైవేద్యం సమర్పించి బహుమతులు అందిస్తారు.
ఈ పూజ యొక్క ముఖ్య ఆధ్యాత్మిక ఫలితం ఏమిటంటే, భక్తులు వారిలో ఉన్న అహంకారం, స్వార్థం మరియు ద్వేషాన్ని తొలగించుకోవాలని విశ్వసిస్తారు. బాలికలు స్వచ్ఛతకు, అమాయకత్వానికి ప్రతీకలు. వారిని పూజించడం ద్వారా భక్తులు దేవి యొక్క సాత్విక శక్తిని మరియు స్వచ్ఛమైన ఆశీర్వాదాలను పొందుతారు. ఇది మోక్షానికి మార్గం సుగమం చేస్తుందని, జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు, కష్టాలను తొలగిస్తుందని ప్రగాఢ నమ్మకం. కన్యా పూజ చేసేవారికి ఐశ్వర్యం సౌభాగ్యం కలుగుతాయని, జీవితంలో అదృష్టం, శాంతి లభిస్తాయని పండితులు చెబుతున్నారు.

నవరాత్రిలో చివరి రెండు రోజులు, ముఖ్యంగా అష్టమి మరియు నవమి తిథులలో కన్య పూజను నిర్వహిస్తారు. ఈ తొమ్మిది రాత్రులలో మనం దుర్గామాత యొక్క తొమ్మిది రూపాలను పూజిస్తాం. ఈ రూపాలన్నీ స్త్రీ శక్తికి ప్రతీకలు. బాలికల రూపంలో దేవిని పూజించడం వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే, దేవి శక్తి భూమిపై అత్యంత స్వచ్ఛమైన రూపం బాలికలలోనే ఉంటుంది. పూజ చేసే సమయంలో ఆ బాలికలలో దేవి శక్తిని దర్శించడం వలన, అది భక్తులకు ప్రేమ కరుణ మరియు మానవత్వం వంటి విలువలను గుర్తు చేస్తుంది.
కన్య పూజ కేవలం ఒక ఆచారం కాదు ఇది మనలోని స్వచ్ఛతను స్త్రీత్వాన్ని గౌరవించడాన్ని ప్రతిబింబిస్తుంది. నిజమైన దైవం మన చుట్టూ ఉన్న ప్రజలలో ముఖ్యంగా బాలికలలో ఉంది అని గుర్తించడమే ఈ నవరాత్రి రహస్యం మరియు కన్య పూజ యొక్క గొప్ప ఆధ్యాత్మిక ఫలితం.