హిందూ ధర్మంలో గోర్లు కత్తిరించడం నుంచి జుట్టు కత్తిరించడం వరకు అనేక పనులకు ఎన్నో నియమాలు ఉన్నాయి.. శుక్రవారం రోజు గోర్లు కత్తిరించవద్దు, మంగళవారం జుట్టు కట్ చేసుకోకూడదు పద్ధతుల గమనించబడ్డాయి. కన్యలు, వివాహిత స్త్రీలకు కూడా ఆచారాలు భిన్నంగా ఉంటాయి. పెళ్లైన వాళ్లు సోమవారం తలస్నానం చేయకూడదనే ఆచారం కూడా ఉంది. సోమవారం తలస్నానం చేస్తే ఏం అవుతుంది.. ఆచారాలు ఏం చెబుతున్నాయో చూద్దాం..!
మహిళలు వీలైనంత వరకు సోమవారాల్లో తలస్నానానికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. సోమవారం మీ జుట్టును కడగడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. శాస్త్రాలలో పేర్కొన్నట్లుగా, సుమంగళి స్త్రీలు సోమవారాలలో తలస్నానం చేయకూడదు. ఇలా చేయడం వల్ల కుటుంబ ఉన్నతికి ఇబ్బంది కలుగుతుందని అంటారు.
జ్యోతిష్యం ప్రకారం సోమవారం కూడా జుట్టు కడగకూడదు. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు పెరుగుతాయని అంటారు.
సోమవారం నాడు స్త్రీలు తలస్నానం చేస్తే ఇంట్లో వారికి అప్పుల బాధ ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
సోమవారం నాడు జుట్టు కడుక్కోవడం వల్ల లక్ష్మీదేవికి కోపం వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇంట్లో అశాంతి, నీరసం పెరుగుతాయి.
పెళ్లయిన స్త్రీలు సోమవారం తలస్నానం చేస్తే భర్త వయస్సుపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది.
మీరు తెలుసుకోవలసినది ఏమిటంటే, ఈ సమాచారం అంతా వివాహిత మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. అవివాహిత స్త్రీలు సోమవారం స్నానం చేయవచ్చు.
ఈరోజుల్లో అన్ని రోజులు తలస్నానం చేస్తున్నారు.. ఆఫీసులకు వెళ్లే వాళ్లు అసలు తలకు నూనె పెట్టరు.. రెండు రోజులకు ఒకసారి తలస్నానం చేయాల్సిందే..అందుకే కదా. ఉన్నవెంట్రుకలన్నీ ఊడేది..! జుట్టును మెయింటేన్ చేయడం కూడా ఒక ఆర్ట్..అది అందరికీ రాదు..!
గమనిక :
ఈ సమాచారం అంతా పండితులు, జ్యోతిష్య శాస్త్ర నిపుణుల ఆధారంగానే ఇవ్వడం జరిగింది.. మనలోకంకు ఎలాంటి సంబంధం లేదని గమనించగలరు.