ఎప్పుడైనా ఆవలింతలు వస్తాయి, అది సాధారణం. కానీ, తరచూ వచ్చే ఆవలింతలను ఏమాత్రం అశ్రద్ధ చేయకండి. ఎందుకంటే ఇది అసలే విపత్కర పరిస్థితి. ఈ ఆవలంతలు కూడా ఒక కారణం ఉంది. మన మెదడు రీఫ్రేష్ అవ్వడానికి ఆవలింతలు వస్తాయి.
పది నిమిషాలకు, పావుగంటకు ఆవలింతలు వస్తే కచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించాలి. ఎందుకంటే ఇలా అవ్వడానికి కారణం మెదడుకు ఆక్సిజన్ అందకపోవటమేనట. వైద్యుల సూచన ప్రకారం మెదడు అలసిపోయినప్పుడు, మెదడులో ఉష్ణోగ్రత పెరిగినప్పుడూ, సరిగా ఆక్సిజన్ అందనప్పుడు ఇలా ఆవలింతలు వస్తూ ఉంటాయి. ఆక్సిజన్ కోసం మెదడు ఆవలింతలను రప్పిస్తుంది. దానివల్ల ఎక్కువ ఆక్సిజన్ మెదడుకు అందుతుంది. ఊపిరి సరిగా ఆడని వారికి ఆక్సిజన్ సరిగా అందదు. వారి ఊపిరి తిత్తుల్లో ఏదో సమస్య ఉన్నట్లే. అందువల్ల వారు సరిగా శ్వాసను తీసుకోలేరు. అప్పుడు శరీరానికి తగినంత ఆక్సిజన్ బాడీలోకి వెళ్లదు. అప్పుడు మెదడుకు వెళ్లే ఆక్సిజన్ పరిమాణం కూడా తగ్గుతుంది. దీనివల్ల నిరంతరం ఆవలింతలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరికైనా ఇలా జరిగితే వారికి సరిగా శ్వాస అందట్లేదని అర్థం.
వారు ఈ విషయంపై ఎక్కువ ఫోకస్ పెట్టి… అవసరమైతే… వెంటనే ఆస్పత్రికి వెళ్లేందుకు రెడీ అవ్వాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఆవలింతలు వచ్చినప్పుడు ఊపిరితిత్తుల్లో కణాజాలాలు బాగా సాగి, ఊపిరి తిత్తుల సైజు పెరుగుతుంది. ఆ తర్వాత నుంచి వాటిలోకి ఎక్కువ గాలి వచ్చేందుకు వీలవుతుంది. కొంత మంది తమకు శ్వాస సరిగా అందుతుందో లేదో గుర్తించలేరు. ఏదో అసౌకర్యంగా ఉన్నట్లు మాత్రం ఫీలవుతారు. అలాంటి వారికి కంటిన్యూగా ఆవలింతలు వస్తున్నట్లైతే… ఊపిరి సరిగా అందట్లేదని అర్థం. ఒకవేళ వారు ఆస్పత్రికి వెళ్లలేని పరిస్థితిలో ఉంటే ముక్కు ద్వారానే ఎక్కువగా గాలి పీల్చి వదిలే ఎక్సర్‌సైజ్‌లు చెయ్యాలి. ఎందుకంటే మీ బాడీకి ఎక్కువ ఆక్సిజన్ మీరు అందించాల్సి ఉంటుంది. ఇలా చేస్తుంటే… ఆవలింతలు రావడం తగ్గిపోతుంది. ఇవి చేసేటపుడు కాఫీ లాంటివి తాగకూడదు. మద్యం తాగకూడదు. నిద్రకు కచ్చితమైన టైమ్ కేటాయించి, కనీసం 6 గంటలు పడుకోవాలి. నిద్ర మధ్యలో మెలకువలు వస్తున్నట్లైతే… అది సరైన నిద్ర కాదు. ఏదైనా పని చేస్తున్న, కూర్చున్న కుర్చీ నుంచి పైకి లేచి, 3 నిమిషాలు అలా తిరిగి రావాలి.
ఫ్రూట్స్ తినండి. వాటిలో విటమిన్లు, పోషకాలు… రక్తంలో త్వరగా కలుస్తాయి. తద్వారా బాడీ త్వరగా సెట్ అవుతుంది. తద్వారా బ్రెయిన్ బాగా పనిచేసి, ఆక్సిజన్ బాగా పొందుతుంది. ఇక అప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా క్యారెట్ తినాలి. చల్లని ప్రదేశాల్లో అలా తిరగాలి. ఎందుకంటే ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది.