షాకింగ్ న్యూస్ : 21 సంవత్సరాలుగా భార్య శవంతో ఇంట్లోనే..

-

కొన్ని బంధాలు మానవ జీవితంలో వీడదీయలేనివి… కొందరు స్నేహితుల మరణవార్త విని తట్టుకోలేక పోతారు.. కొందరు తల్లి దండ్రుల, ప్రేమించిన అమ్మాయి, భార్య, పిల్లలు, ఇలా ఎవరైనా కావచ్చు.. అయితే.. అది వారి మధ్య ఉన్న బంధంపై ఆధారపడి ఉంటుంది. భార్యంటే ఎంతో ఇష్టం, ప్రేమ ఉన్న భర్తకు భార్య మరణించడం అనేది భరించలేని భాద.. దీంతో కొందరు కొన్ని రోజులు మానసికంగా.. క్షోభకు గురవుతారు.. అయితే వై భర్త తన భార్య చనిపోతే అంత్యక్రియలు చేయకుండా.. తనతో పాటే ఉంచుకున్నాడు.. థాయ్‌ల్యాండ్‌లో భార్య శవాన్ని 21 సంవత్సరాల పాటు ఇంటిలోనే అట్టిపెట్టుకున్న ఓ వ్యక్తి ఎట్టకేలకు అంత్యక్రియలు నిర్వహించాడు. విశ్రాంత సైనికాధికారి చాన్‌ చనవచరకర్న్‌ భార్య అనారోగ్యంతో రెండు దశాబ్దాల క్రితం చనిపోవడంతో.. భార్య మృతదేహాన్ని శవపేటికలో ఉంచి ఇంటిలోనే భద్రంగా చూసుకుంటున్నాడు.

రోజూ శవపేటిక దగ్గర కూర్చుని భార్యతో ముచ్చటించేవాడు. భార్య భౌతికకాయంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకునేవాడు. తన వయసు 72 దాటింది. ఇంకా శవపేటిక పరిరక్షణ తనవల్ల కాదనుకున్నాడో ఏమో గాని భార్యకు అంత్యక్రియలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఓ ధార్మిక సంస్థ సాయంతో కర్మకాండ పూర్తి చేశాడు. అంతటితో ఊరుకోలేదు. చితాభస్మాన్ని ఓ కలశంలో ఉంచి ఇంటికి తీసుకుపోయాడు. తాను బతికి ఉన్నంత వరకు అది తనతోనే ఉంటుందని ఇంట్లో పెట్టుకున్నాడు. అయితే.. ఈయనను చుసిన కొందరు పిచ్చి అంటుంటే.. మరి కొందరు.. భార్య భర్తల బంధం చాల గొప్పదంటూ ముచ్చటించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version