ఆకాష్ పూరీ ఈసారైనా హిట్ కొడతాడా.?

-

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన ఎంతోమంది హీరోలకు మంచి సక్సెస్ రేట్ ను అందించాడు అని చెప్పడంలో సందేహం లేదు. ఇక ప్రస్తుతం ఆయన వారసుడు ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆకాష్ పూరి చైల్డ్ ఆర్టిస్ట్గా బుజ్జిగాడు, చిరుత, గబ్బర్ సింగ్, బిజినెస్ మ్యాన్ వంటి పలు సినిమాలలో అలరించాడు. ఈ క్రమంలోనే ఆంధ్ర పోరి అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ఆశించినంత విజయాన్ని అందుకోక పోవడం తో ఈసారి తన కొడుకు బాధ్యతను తీసుకున్న పూరి జగన్నాథ్ మెహబూబా అనే సినిమాను తెరకెక్కించాడు. అయితే ఈసారి కూడా ఆకాష్ పరాజయమే అందుకోవడం గమనార్హం.

ఇక ఈ నేపథ్యంలోనే గత ఏడాది రొమాంటిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన.. పూరీ కొడుకుని ఎలాగైనా సరే హీరోగా నిలబెట్టాలని ఇండస్ట్రీలో ఉండే పెద్ద పెద్ద హీరోలు కూడా తమ వంతు సపోర్ట్ చేశారు. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ స్వయంగా ఆకాష్ ను ప్రమోట్ చేయడానికి బాధ్యత తీసుకున్నారు. మొన్నా మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చోర్ బజార్ అనే చిత్రంతో మళ్లీ వస్తున్నారు ఆకాష్. జార్జి రెడ్డి ఫేమ్ జీవన్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక విభిన్నమైన కథా కథనాలతో లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని నిర్మాతలు వెల్లడించారు .

ఈ సినిమా విజయాన్ని సాధిస్తేనే ఆకాష్ పూరీ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతారు . లేకపోతే ఈయనకు అవకాశం ఇవ్వడానికి దర్శకులు కూడా ఆలోచిస్తారు అని చెప్పడంలో సందేహం లేదు. కనీసం ఈ సినిమాతో నైనా ఆకాష్ ప్రేక్షకులను మెప్పించాలని హీరోగా స్థిరపడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటుంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version