షర్మిలమ్మ ఇంకా వర్కౌట్ అవ్వదమ్మ…అంతా తెలిసిపోయినట్లుంది….

-

తెలంగాణ రాజకీయాల్లో షర్మిల సక్సెస్ అవుతారా? బలమైన రాజకీయ పార్టీల మధ్య వైఎస్సార్టీపీ బలపడగలదా? అంటే ఇప్పటిలో షర్మిల సక్సెస్ అవ్వడం గానీ, వైఎస్సార్టీపీ బలపడటం జరిగే పని కాదని రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అధికార టి‌ఆర్‌ఎస్ బలంగా ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్, బి‌జే‌పిలు టి‌ఆర్‌ఎస్‌కు పోటీ ఇస్తున్నాయి. అంటే ఈ మూడు పార్టీల మధ్యే అసలైన రాజకీయం నడుస్తోంది. ఇలాంటి పరిస్తితుల్లో తెలంగాణలో కూడా రాజన్న రాజ్యం తీసుకోస్తానని షర్మిల కొత్తగా పార్టీ పెట్టారు.

Sharmila

అయితే ఈమె పార్టీ ఇప్పటిలో సక్సెస్ కావడం చాలా కష్టమనే చెప్పొచ్చు. అదే సమయంలో షర్మిల పార్టీ పెట్టిండదే కాంగ్రెస్‌ని దెబ్బతీయడానికి అని ప్రచారం కూడా ఉంది. ఈ విషయాన్ని టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం చెప్పారు. తమని దెబ్బతీసి పరోక్షంగా కే‌సి‌ఆర్‌కు లబ్ది చేకూర్చడానికే షర్మిల పార్టీ పెట్టారని అన్నారు. కానీ ఈ విషయంలో కూడా షర్మిల ప్లాన్ వర్కౌట్ అవ్వడం కష్టమని విశ్లేషకులు మాట్లాడుతున్నారు.

ఎందుకంటే షర్మిల చేస్తున్న రాజకీయాలని చూస్తుంటే, ఆమె కాంగ్రెస్ ఓటు బ్యాంకుని లాక్కోవాలని చూస్తున్నట్లే కనిపిస్తోంది. ఆ దిశగానే ఆమె పనిచేస్తుంది. సాధారణంగా కాంగ్రెస్‌కు దళిత, మైనారిటీలు ఎక్కువ మద్ధతుగా ఉంటారు. ఇప్పుడు వారిని టార్గెట్ చేసే షర్మిల ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది.

అందుకే ఇప్పుడు దళితభేరి పేరిట సభలు పెట్టి దళితులని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటు ఎలాగో రేవంత్….దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా పేరిట సభలు పెట్టి కే‌సి‌ఆర్ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. షర్మిల కూడా ఇదే ఫార్ములాతో ముందుకెళుతున్నారు. అయితే ఈ ఫార్ములా వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. షర్మిల కేవలం కాంగ్రెస్‌ని దెబ్బతీయడానికే రాజకీయం చేస్తున్నట్లు క్లియర్‌గా అర్ధమవుతుంది. ఇక ఆమె రాజకీయాలు వర్కౌట్ కావడం లేదనే, ఆ పార్టీ నేతలు కూడా షర్మిలకు షాకులు ఇచ్చేస్తున్నారు. ఏదేమైనా తెలంగాణలో షర్మిల రాజకీయాలు వర్కౌట్ అయ్యేలా లేవు.

Read more RELATED
Recommended to you

Exit mobile version