కరోనా వ్యాక్సిన్ల విషయంలో ప్రపంచ వ్యాప్తంగా అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ వ్యాక్సిన్ల సామర్థ్యం ఎలా ఉంటుందనేది అయోమయంగా తయారయ్యింది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ రాయబారి డేవిడ్ మాట్లాడిన దాని ప్రకారం, కొన్ని రోజుల తర్వాత వ్యాక్సిన్ల సామర్థ్యం ఎలా పనిచేస్తుందనేది అనుమానంగా ఉందని, ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని, అదీగాక కరోనా కొత్త కొత్త వేరియంట్లు వ్యాక్సిన్లకు చిక్కకుండా తప్పించుకునే అవకాశమూ ఉందని హెచ్చరిస్తున్నారు.
ఈ మేరకు బ్లూమ్ బర్గ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అందుకే బూస్టర్ షాట్ల అవసరం చాలా ఉందని పలికారు. కరోనా వ్యాక్సిన్ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు బూస్టర్ షాట్లు మేలు చేస్తాయని డేవిడ్ మాట్లాడారు. ఇప్పటికే యునైటెడ్ కింగ్ డమ్ ఈ విషయంలో ముందు వరుసలో ఉంటుందని, అక్కడి ప్రజలకు బూస్టర్ షాట్ల విషయంలో అవగాహన కల్పించేలా ప్రయత్నిస్తుందని తెలిపింది.