చెంపదెబ్బ ఎఫెక్ట్….. హాలీవుడ్ యాక్టర్ విల్ స్మిత్ ఆస్కార్ లో పాల్గొనకుండా 10 ఏళ్లు నిషేధం

-

హాలీవుడ్ స్టార్ యాక్టర్ విల్ స్మిత్ చెంపదెబ్బ వ్యవహారం ఇటీవల ప్రపంచవ్యాప్తంగా హైలెట్ అయింది. వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్రిస్ రాక్ పై ఆగ్రహంతో విల్ స్మిత్ చేయిజేసుకున్నాడు. అసభ్యకరమైన రీతిలో విల్ స్మిత్, క్రిస్ రాక్ ను తిట్టాడు. ఈ వ్యవహారంపై ఆస్కార్ అకాడమి క్రమశిక్షణ చర్యలకు పూనుకుంది. 10 ఏళ్ల పాటు ఆస్కార్ అకాడమీ వేడుకల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. ఈనిర్ణయంతో విల్ స్మిత్ ఇక పదేళ్ల పాటు ఎటువంటి అవార్డుల కార్యక్రమంలో పాల్గొనకుండా అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ అండ్ సైన్స్ నిర్ణయం తీసుకుంది.

ఇటీవల ఆస్కార్ వేడుకల్లో విల్ స్మిత్, క్రిస్ రాక్ ను చెంపదెబ్బ కొట్టాడు. తన భార్య జాదాపై, ఆమె జుట్టుపై జోక్ వేయడంతో ఆగ్రహంతో విల్ స్మిత్, క్రిస్ రాక్ ను స్టేజ్ పైనే కొట్టాడు. ఇది వివాదాస్పదం అయింది. పలువురు విల్ తీరుపై విమర్శలు గుప్పించారు. దీంతో విల్ స్మిత్ ఆస్కార్ అకాడమీ నుంచి తప్పుకున్నాడు. క్రిస్ రాక్ కు క్షమాపణలు కూడా చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version