నిమిషాల్లోనే ఫోన్ డెడ్ అయిపోతుందా? ఇలా చేస్తే బ్యాటరీ సేఫ్..

-

స్మార్ట్ ఫోన్ ను జనాలు ఎంతగా వాడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పుడు ప్రతి ఇంట్లో కనీసం రెండు మూడు ఫోన్లు ఉంటాయి.. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను తరచూ వేధించే సమస్య చార్జింగ్.. మనం ఎంతగా ఫుల్ చార్జింగ్ పెట్టుకున్న కూడా త్వరగా అయిపోతుంది..ఎక్కడకు వెళ్లినా ముందు మొబైల్ చార్జింగ్ కోసం చూస్తూ ఉంటాం. అదే ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్తే కచ్చితంగా పవర్ బ్యాంక్ మనతో ఉండేలా చూసుకుంటాం. అయితే ఈ సమస్య నుంచి రక్షణకు స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఎక్కువ పవర్ ఉన్న బ్యాటరీలను ఇవ్వడం స్టార్ట్ చేశాయి… అయినా కూడా బ్యాటరీ డెడ్ అవుతుంది..ఫోన్ ఛార్జింగ్ ను సేవ్ చేసుకోవడం పై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఫోన్ చార్జింగ్ 5 శాతం కంటే తక్కువకు పడిపోతుంది. ఒక్కోసారి చార్జింగ్ లేక స్విఛ్ ఆఫ్ అయ్యిపోతుంటుంది. వెంటనే చార్జింగ్ పెడుతుంటాం. అది బ్యాటరీ లైఫ్‌పై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి బ్యాటరీ 15-20 శాతం ఉన్నప్పుడే చార్జింగ్ పెట్టడం మేలని నిపుణులు హెచ్చరిస్తున్నారు..

ఫోన్ చార్జింగ్ పెట్టే సమయంలో ఫోన్‌కు ఉన్న కేస్‌తో చార్జింగ్ పెడుతుంటాం. ఇలా చేయడం ద్వారా బ్యాటరీ వేడెక్కిపోయి బ్యాటరీ పనితీరును చెడగోడుతుంది. అలాగే చార్జింగ్ కనెక్టర్‌ను కూడా విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది.. అందుకే ఫోన్ కేసును తీసి చార్జింగ్ పెట్టడం మేలు.. ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version