దర్శకుడు శంకర్‌కు భూమి కేటాయింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. హైదరాబాద్‌కు చెందిన నిరుద్యోగి శంకర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఉన్నత న్యాయస్థానం వాదనలు జరిగాయి. రూ.2.5 కోట్ల భూమిని రూ.25 లక్షలకు ఎలా కేటాయిస్తారని హైకోర్టు మరోసారి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తెలంగాణ ఉద్యమంలో శంకర్ కీలకపాత్ర పోషించారని అడ్వొకేట్ జనరల్ న్యాయస్థానానికి తెలిపారు. తెలంగాణ కోసం త్యాగం చేసిన వేలమందికి ఇలాగే ఇస్తారా? హైకోర్టు ఏజీని నిలదీసింది. విషయంపై కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం రెండు వారాల గడువు కోరగా.. విచారణను వాయిదా వేసింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘన్‌పూర్ మండలం గాంధీనగర్, మైలారం గ్రామాల మధ్య 250 ఎకరాల అటవీ భూముల కేటాయింపులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కాలుష్య నియంత్రణ మండలి తదితరులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేటాయింపులకు సంబంధించి పూర్తి వివరాలతో 4 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. అభివృద్ధి ముసుగులో అటవీ భూములను వివిధ సంస్థలకు కేటాయించడాన్ని సవాలు చేస్తూ జయంశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన న్యాయవాది వెంపటి గంగాప్రసాద్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.