రాష్ట్రంలో మరో యువరైతు ఆత్మహత్య.. చెట్టుకు ఉరేసుకుని!

-

రాష్ట్రంలో మరో యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలోని మద్దూరు మండల పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. హెడ్ కానిస్టేబుల్ నాగిరెడ్డి కథనం ప్రకారం.. రేబర్తి గ్రామానికి చెందిన నలుసాని రాజిరెడ్డి (45) గత కొన్ని సంవత్సరాలుగా నరాల వ్యాధితో బాధపడుతున్నాడు.

 

ఆస్పత్రిలో చూపించుకున్నప్పటికీ వ్యాధి నయం కాలేదు. ఈ క్రమంలోనే జీవితం మీద విరక్తి చెంది గురువారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రపోయిన టైంలో తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.మృతుడి భార్య లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు.మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version