Chiranjeevi: ‘చూడాలని ఉంది’ చిరంజీవి ఈజ్ బ్యాక్..‘ఆచార్య’లో మెగాస్టార్ లుక్ అదుర్స్

-

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సినిమాలు చేయడంలో యంగ్ హీరోలతో పోటీ పడటమే కాదు. తన వయసును కూడా అమాంతంగా తగ్గించేసుకుంటున్నాడు. ‘ఆచార్య’ పిక్చర్‌లో చిరంజీవి వింటేజ్ లుక్స్ చూస్తు ఉంటే ‘అన్నయ్య’, ‘చూడాలని ఉంది’ సినిమాల నాటి చిరంజీవి గుర్తొస్తున్నాడని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ‘ఆచార్య’గా టైటిల్ రోల్ ప్లే చేస్తున్న చిరంజీవి..లుక్స్ పైన ఫుల్ ఫోకస్ చేసినట్లు ట్రైలర్, పోస్టర్స్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ సినిమాలో తన తనయుడు రామ్ చరణ్ తో చిరంజీవి కలిసి నటించారు. నిజానికి వీరిరువురు తండ్రీ తనయులు. కానీ, సినిమా పోస్టర్స్ , ట్రైలర్ లో చూస్తుంటే కనుక మెగా బ్రదర్స్ లాగా కనబడుతున్నారు.

అంతలా చిరంజీవి తన ఏజ్ తగ్గించేసుకున్నారని మెగా అభిమానులు అంటున్నారు. అయితే, తను అలా అందంగా, యంగ్ గా కనబడటానికి కారణం సినిమాటోగ్రాఫర్ తిరు కారణమని చిరు చెప్పాడు. చిరంజీవి వింటేజ్ లుక్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. ‘ఆచార్య’ సినిమా తర్వాత చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ పిక్చర్ రిలీజ్ కానుందని తెలుస్తోంది.

చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ‘భోళాశంకర్’ తో పాటు బాబీ దర్శకత్వంలో MEGA 154 సినిమా చేస్తున్నారు. ఈ పిక్చర్ కు ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ తర్వాత యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములతో మెగాస్టార్ తన 155వ సినిమా చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version