300 మంది ఉద్యోగులకు షాకిచ్చిన విప్రో.. మూన్‌ లైటింగ్‌ ఎఫెక్ట్‌

-

మూన్‌ లైటింగ్‌ ఎఫెక్ట్‌తో 300 మంది ఉద్యోగులకు ఉద్వాసన ఇచ్చింది విప్రో సంస్థ. ఓ సంస్థ‌లో ఉద్యోగానికి చేరి… ఆ సంస్థ‌కు తెలియ‌కుండా ఇంకో సంస్థ‌కు కూడా ప‌నిచేసే స‌రికొత్త విధానం మూన్ లైటింగ్. ఇప్పుడీ విధానమే విప్రోలో 300 మంది ఉద్యోగుల‌పై వేటు ప‌డేలా చేసింది. త‌మ సంస్థ‌లో ఉద్యోగానికి చేరి..ఆ సంస్థ అనుమ‌తి లేకుండా వేరే కంపెనీల‌కు కూడా ఈ 300 మంది ఉద్యోగులు ప‌ని చేస్తున్న‌ట్లుగా విప్రో గుర్తించింది. ఆ వెంట‌నే వారిని ఉద్యోగాల్లో నుంచి తొల‌గిస్తూ బుధ‌వారం విప్రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ విష‌యాన్ని విప్రో చైర్మ‌న్ రిష‌ద్ ప్రేమ్‌జీ స్వ‌యంగా వెల్ల‌డించారు. క‌రోనా ఉద్ధృతి నేప‌థ్యంలో ఉద్యోగుల ప‌నివేళ‌ల్లో పూర్తి స్థాయిలో మార్పులు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

వ‌ర్క్ ఫ్రం హోం పధ్ధతి అమ‌లులోకి వ‌చ్చింది. ఈ పధ్ధతిలో ఇంటి వ‌ద్ద నుంచే ప‌నిచేస్తున్న కొంద‌రు ఉద్యోగులు… తాము ప‌నిచేస్తున్న సంస్థ‌ల‌కు తెలియ‌కుండా ఖాళీ స‌మ‌యాల్లో ఇత‌ర సంస్థ‌ల‌కూ ప‌నిచేయ‌డం మొద‌లుపెట్టారు. ఈ పద్ధతినే మూన్ లైటింగ్ అని పిలుస్తున్నారు. దీనిని గుర్తించిన కంపెనీలు త‌మ ఉద్యోగుల‌కు ఇప్ప‌టికే హెచ్చ‌రిక‌లు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version