ఈ చిన్న చిన్న చిట్కాలతో ముక్కుమీద వచ్చే బ్లాక్‌ స్పాట్స్‌ని కంప్లీట్‌గా తొలగించుకోవచ్చు..!

-

కొంతమందికి ముక్కుపైన చిన్న చిన్న మచ్చలు వస్తుంటాయి. బ్లాక్‌ స్పాట్స్ లాంటివి. వీటిని తగ్గించుకోవడానికి మనం చాలా చేస్తుంటాం. అసలు ఇవి ఎందుకు వస్తాయి..సహజంగా వీటిని ఏం చేస్తే తగ్గించుకోవచ్చో ఈరోజు చూద్దాం.
మన చర్మంలో కణజాలం లోపల మెలనిన్‌ను ఉత్పత్తి చేసే మెలనోసైట్స్‌ ఉంటాయి. ఇవి నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇవి కొన్ని రకాల కారణాల చేత ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఎండకు కూడా ఇవి ఇరిటేట్‌ అయి..ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతుంది. అందుకే..ఎండలో తిరిగితే నల్లబడతాం. ముక్కుపైన కండ ఎక్కువగా ఉంటుంది. ఇది పలచగా ఉంటుంది..ఎండ ఎక్కువగా పడేట్లు కుర్చున్నప్పుడు..ఇతర భాగాలకంటే..ముక్కుపై సూటిగా పడుతుంది. అప్పుడు మెలనిన్‌ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అందుకే ఎండలో తిరిగేప్పుడు..టోపీ పెట్టుకోండి. అప్పుడు ముక్కుమీద ఎండ పడదు. లేదంటే..కొద్దిగా కొబ్బరినూనె రాసుకుని వెళ్లొచ్చు. బయటకు వెళ్తూ ముఖానికి జిడ్డుచేసుకోవటం ఎందుకు అనుకుంటే..టోపీ కానీ, ఏదైనా క్లాత్‌తో ఫేస్‌ను కవర్‌చేసుకోవడమే.
నలుపువర్ణాన్ని తగ్గించడానికి, మెలనోసైట్‌ కణజాలం యొక్క స్టిమ్యులేషన్‌ తగ్గించడానికి తేనె బాగా పనికొస్తుంది. ఒరిజనల్‌ తేనె తీసుకుని..రోజుకు రెండు మూడుసార్లు ముక్కుమీద రాసుకుని మర్దన చేస్తూ ఉండండి. 5-10 నిమిషాలు అలా మర్ధన చేసుకుని..గంటపాటు అలా ఉంచండి. ఈ తేనెలో ఉండే అనేక రకాల ఇన్ఫ్లమేషన్‌ను తగ్గించే గుణం..మెలనోసైట్స్‌ వల్ల వచ్చిన ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. నలుపు ఉత్పత్తిని ఆపుతుంది.
మట్టి చికిత్స చాలా మంచిది. పొలాల్లో ఉండే నల్లటి మట్టి తెచ్చుకోండి..ఇప్పుడు అది సాధ్యంకాకపోతే..మనకు మార్కెట్‌లో ముల్తానామట్టి ఎలానో అందుబాటులో ఉంది. దాన్ని నీళ్లలో నానపెట్టి ముక్కుమీద వేసి అలా వదిలేసేయండి. ‌20-30 నిమిషాలు అలా ఉంచుకోండి. రోజుకు రెండుసార్లు అలా చేస్తూ ఉండండి. మట్టివేసినందువల్ల ముక్కు భాగం చల్లపడుతుంది. చల్లబడ్డ భాగాన్ని వెచ్చగా చేసేందుకు..శరీరంలో ఉన్న రక్తప్రసరణ ఈ ముక్కు చర్మానికి ఎక్కువగా వచ్చేస్తుంది. రక్తప్రసరణ ఎక్కువ వచ్చేసరికి ముక్కుకణజాలానికి మంచి ప్రాణవాయువు, పోషకాలు అన్నీ వస్తాయి. అన్నీ బాగా అంది..స్కిన్‌ స్కెల్స్‌ హెల్తీగా అవుతాయి. వ్యర్థాలను తొలగించి డీటాక్సిఫికేషన్‌ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది.
ఈ చిట్కాలతోపాటు..డైలీ ఉదయాన్నే సిట్రస్‌ ఫ్రూట్‌ జ్యూస్‌లు తాగితే మరీ మంచిది. ఇవి యాంటిఆక్సిడెంట్‌ జ్యూస్‌లు అంటారువీటిని..మన శరీరంలో కణజాలం ఇన్ఫెక్షన్‌ భారిన పడినప్పుడు కోలుకోవడానికి, ఆ ఇన్ఫెక్షన్‌ త్వరగా తగ్గడానికి, స్కిన్‌ హెల్తీగా ఉంచడానికి వీటమిన్‌ సీ, ఏ బాగా ఉపయోగపడతాయి. వీటికోసం సిట్రస్‌ జ్యూస్‌ తాగటం చాలా మంచిది. పొద్దున లేదా సాయంత్రం బత్తాయి, కమలా జ్యూస్‌ లాంటివి తాగుతూ ఉంటే..స్కిన్‌ హెల్తీగా ఉంటుంది.
ఉదయంపూట విటమిన్‌ A బాగా అందాలంటే..కీరాదోసకాయ, టమాటా జ్యూస్‌ రెగ్యులర్‌గా తాగండి. ఈ జ్యూస్‌లో కొత్తిమీర, కరివేపాకు, పుదినా కూడా వేసి తాగగలిగితే..నాచురల్‌గా నోస్‌ మీద వచ్చే బ్లాక్‌ స్పాట్స్‌ను కంప్లీట్‌గా తొలగించుకోవచ్చు. స్కిన్‌ కూడా ఆరోగ్యంగా అందంగా ఉంటుంది. విటన్నింటికంటే..ముఖ్యంగా మంచినీళ్లు బాగా తాగండి. ఎండకు వెళ్లినప్పుడు..ఆ అల్ట్రావైరస్‌ రేస్‌కి స్కిన్‌ని ఇరిటేట్‌ చేయకూడదంటే..నీళ్లు బాగా తాగాలి. నీళ్లు సరిపడా తాగితే..హీట్‌ నుంచి స్కిన్‌లో ఉండే వాటర్‌ రక్షిస్తుంది. అందుకే శరీరానికి సరిపడా 4లీటర్ల నీరు ఒక రోజుకు అందించాలని ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు అంటున్నారు.
Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version