స్ఫూర్తి: రైతులకి అండగా నిలిచిన మహిళ… ఈమె చేసిన పని చూస్తే మెచ్చుకుంటారు..!

-

ఈ మధ్య కాలంలో చాలా మంది రైతులు సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. సిక్కిం రాష్ట్రం మొత్తం కూడా సేంద్రియ వ్యవసాయం చేస్తోంది. మధ్యప్రదేశ్ లో 16 జిల్లాలలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు. మొత్తం 1800 గ్రామాలలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు.

అయితే దీనికి గల కారణం ఒక మహిళా రైతు. ఆమె పేరు ప్రతిభా తివారీ. నిజానికి ఆమె ప్రోత్సాహం వల్లే అక్కడ రైతులు సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. నిజంగా ఆమె రైతులకి అండగా నిలిచి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. మరి ఇక ఆమె గురించి, ఆమె చేసిన గొప్ప పని గురించి ఇప్పుడు చూద్దాం.

2016లో ప్రతిభా తివారీ భూమి షా ఆర్గానిక్స్ ని స్థాపించారు. అయితే వందలాది మంది రైతులు పండిస్తున్న ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తున్నారు ఈమె. పైగా ఉత్పత్తుల్ని ఆర్గానిక్ గా ప్రాసెసింగ్ చేసి దేశ వ్యాప్తంగా 450 మంది వినియోగదారులకు ఇస్తున్నారు.

ఇలా రైతులు అదనపు ఆదాయాన్ని పొందేటట్టు చేస్తున్నారు ప్రతిభ. ఈమె మ్యాథ్స్ లో మాస్టర్స్ చేసి అదే రంగంలో స్థిరపడాలని అనుకున్నారు. కానీ అనుకోకుండా ఆమె వ్యవసాయాన్ని అత్తమామల దగ్గర నుంచి నేర్చుకుని దానిని ఆదర్శంగా తీసుకొని అదే బాటలో నడుస్తున్నారు.

వ్యవసాయ పద్ధతులపై పరిశోధన కూడా ఆమె మొదలుపెట్టారు. రసాయన వ్యవసాయం వల్ల హాని ఉందని గుర్తించి ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మక్కువ చూపించారు. ఆ తర్వాత అదే దిశగా నడుచుకోవాలని మొదలు పెట్టారు. తానే స్వయంగా భూమిషా ఆర్గానిక్స్ ప్రారంభించి రైతులు తమ పంటలు సరైన ధరకు విక్రయించడం కోసం ఒక వేదిక తీసుకువచ్చారు.

ఇప్పుడు అక్కడికి వివిధ ప్రాంతాల నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి. రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర వంటి ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మంది ఆర్డర్ పెడుతున్నారు. ఇలా ఈమె చాలామంది రైతులకి అదనపు ఆదాయం తీసుకువచ్చి మంచి మార్గంలో నడుచుకుంటున్నారు. నిజంగా ఇలాంటి మహిళలని ఆదర్శం తీసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version