ఆ మహిళా క్రికెటర్ అల్లు అర్జున్ కి పెద్ద ఫ్యాన్..

-

తెలుగులో స్టార్ హీరో అయిన అల్లు అర్జున్ కి దక్షిణాదిన అభిమానులు బాగానే ఉన్నారు. తెలుగుతో పాటు మళయాలంలోనూ ఒకే సారి సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇక కన్నడ, తమిళ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ కి మంచి గుర్తింపు ఉంది. బాలీవుడ్లోనూ అల్లు అర్జున్ హిందీ అనువాద చిత్రాలకి వ్యూస్ బాగానే వస్తుంటాయి. ఈ లెక్కన అల్లు అర్జున్ కి ఫ్యా ఫాలోయింగ్ భారీగానే ఉంది. తాజాగా మహిళా క్రికెటర్, తాను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి అభిమానిని అని చెప్పుకుంది.

భారత మహిళా జట్టు క్రికెటర్, ప్రియా పూనియా కి అల్లు అర్జున్ అంతే అభిమానమట. ఈ మేరకు తన ఫాలోవర్స్ తో జరిపిన చిట్ చాట్ లో పేర్కొంది. అల్లు అర్జున్ డాన్సులు, స్టైలిష్ లుక్ బాగుంటాయని తెలిపింది. మొత్తానికి అల్లు అర్జున్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజిలో ఉందో అర్థమైపోయింది. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా పుష్ప పేరుతో సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజిలో సినిమా తెరఎకెక్కుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version