ఈ మధ్య కాలంలో మహిళలు కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకొని వ్యాపారంలో కూడా రాణిస్తున్నారు. ఉద్యోగం కోసమే ఎదురు చూడడం… ఉద్యోగం రావాలి అని ఎంతగానో కష్టపడడం కంటే కూడా సొంతంగా ఇలా మొదలు పెట్టొచ్చు. మీ అభిరుచికి తగ్గట్టు మీ ఆసక్తికి తగ్గట్టు మీరు నచ్చిన రంగాన్ని ఎంచుకోవచ్చు. అయితే మీరు చేసే పని పట్ల మీకు ఆసక్తి ఉంటే సరిపోతుంది.
నిజానికి ఈమె చేసిన పని చూస్తే ఆదర్శంగా తీసుకుని మీరు కూడా అదే బాటలో వెళ్తారు. తన తండ్రి ఆరోగ్యం బాగోలేదని తాను ఏదో ఒక పని చేయాలని అనుకుంది. ఆమెపై ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ పడింది. ఆమె చదువు కోసం తన తండ్రి ఆరోగ్యం కోసం అలానే ఇంట్లో వాళ్ళ కోసం కష్టపడాలని అనుకుంది.
ఒక ఎకరం పొలం లో ఆమె పుట్టగొడుగులు పండించడం మొదలుపెట్టింది. నిజానికి ఆమెకున్న నమ్మకమే ఆమె బలం. అయితే బబిత చిన్న వయసులోనే కష్టపడటం, సంపాదించడం మొదలుపెట్టింది. ఈమె కేవలం ఒక ఎకరంలో పుట్టగొడుగులు పండించడమే కాకుండా 500 మంది మహిళల కి ఎలా పండించాలి అనేది కూడా నేర్పించింది.
మొట్టమొదటి సారి ఆమె పుట్టగొడుగులుని పండించినప్పుడు ఆమెకి వచ్చిన ప్రాఫిట్ ₹1000. ఇప్పుడు ఆమె ఎన్నో రకాల కొత్త టెక్నిక్లు కూడా ఉపయోగిస్తుంది. వాటితో పాటు ఆమె వంకాయ, క్యాప్సికం, ఓక్రా, క్యాబేజి, ఉల్లి, వెల్లుల్లి మొదలైన కూరగాయలను కూడా పండిస్తోంది.
అయితే ఈమె ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ని మాత్రమే ఉపయోగిస్తోంది. కెమికల్స్ ని వాడదు. ఇలా చిన్న వయసులో ఎంతో కష్టపడి కుటుంబం కోసం ఎన్నో విధాలుగా అభివృద్ధి చేస్తూ ఉండడం నిజంగా ఎందరికో ఆదర్శం.