మహిళలు వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.. ఏంటంటే?

-

ఆడవాళ్ళు అంటే అందానికి కెరాఫ్.. అందుకే కవులు వాళ్ళను అందమైన పూలతో, పండ్లు, పక్షులతో పొలుస్తారు.ప్రకృతిని తమ అందంలో దాచుకుంటారు. అందుకే వారిని ప్రకృతి పరువాలు..అందమైన సెలయెల్లు అని ఏవేవో పేర్ల తో పిలిస్తారు.స్త్రీలు అంటేనే అలంకారం. ఆడవాళ్లు అందంగా ముస్తాబు అవకుండా పక్కనున్న గల్లీకి కూడా వెళ్లరు.పదిమందిలో తామే అందంగా కనిపించాలనే ఆరాటం ఉంటుంది. ఇక పెళ్ళిళ్ళు, పెద్ద ఫంక్షన్లు అయితే చెప్పనక్కర్లేదు.. గంటలు తరబడి ముస్తాబు అవుతారు.ఆ విషయంలో అస్సలు సందేహం లేదు.

చీర కట్టుకోవడం దగ్గర నుంచి లిప్ స్టిక్ అద్దుకోవడం వరకూ అన్నీ మ్యాచింగే కావాలి. అందులో ఏది తక్కువైనా వాళ్లు తట్టుకోలేరు. అంతే కాదండోయ్ అద్దం ముందే గంటలు గంటలు కూర్చొని సింగారించుకుంటారు. తమను తాము అందంగా అలంకరించుకొని మురిసిపోవడమే కాకుండా అందరి ముందూ హుందాగా కనిపించాలని తహతహలాడిపోతుంటారు. అందుకే పురాణ కాలం నుంచి మన మగువలకు 16 అలంకారాలు ఉంటాయి. అవేమిటో ఇప్పుడు చుద్దాము.

1. దంత ధావనము, 2. నలుగు పెట్టి స్నానము, 3. పసుపు పూత, 4. చీర, రవిక, 5. పారాణి, 6. శిరోజాలంకరణ, 7. పుష్పాలంకరణ, 8. పాపిట కుంకుమ, 9. బుగ్గన చక్కటి చుక్క, 10. లలాట తిలకము, 11. గోరింటాకు, 12. తాంబూలము, 13. పెదవులకి ఎరుపు రంగు.. అంటే లిప్ స్టిక్, 14. కంటికి కాటుక, 15. సర్వాభరణ అలంకరణ, 16. పెళ్ళి అయిన వారికి మంగళ సూత్రమూ, నల్ల పూసలూ, మెట్టెలు. ఇవన్నీ పెట్టుకుంటేనే ఆడ వాళ్ల అలంకరణ పూర్తి అయినట్లు. ఇందులో ఏది తక్కువ అయినా స్త్రీలు నిండుగా కనిపించరు. అందుకే వారిని అందంగా అలంకరించుకోనివ్వండి.మనవాళ్ళు అందంగా ఉంటే మనకే మంచిది కదా.. రెడీ అవ్వనివ్వండి..వద్దన్నా వాళ్ళు ఆగరు..

Read more RELATED
Recommended to you

Exit mobile version