భ‌ర్త ఉండ‌గానే మ‌రొక‌రితో శృంగారం.. అడ్డుస్తున్నాడ‌ని అక్క కొడుకునే..!

-

వివాహేత‌ర సంబంధాల‌తో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. అక్ర‌మ సంబంధం మోజులో ప‌డి కుటుంబ స‌భ్యుల‌పైనే దారుణానికి ఒడిగ‌ట్ట‌డానికి ఏ మాత్రం ఆలోచించ‌డం లేదు. త‌మ సంతోషానికి అడ్డువ‌స్తున్నార‌ని సొంత కుటుంబ స‌భ్యుల‌ను హ‌త్య చేస్తున్నారు. ఇలాంటి దారుణ‌మైన ఘ‌ట‌న‌లు ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ జరుగుతున్నాయి. తాజా గా ఇలాంటి దారుణ‌మైన ఘ‌ట‌న నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని హ‌న్మంతు తండాలో లక్ష్మి అనే మ‌హిళ త‌న కుటుంబంతో జీవిస్తుంది. లక్ష్మితో రాజు (16) అనే యువ‌కుడు కూడా ఉంటున్నారు.

రాజు.. లక్ష్మి అక్క కుమారుడు. రాజు త‌ల్లి దండ్రులు ఇటీవల మ‌ర‌ణించారు. దీంతో రాజు.. లక్ష్మి వ‌ద్దే ఉంటున్నాడు. ప్ర‌తి రోజు కూలీ ప‌ని చేసుకుంటున్నాడు. అయితే లక్ష్మికి ఒక‌రితో వివాహేత‌ర సంబంధం ఉంది. ప్ర‌తి రోజు లక్ష్మి త‌న ప్రియుడుతో క‌లిసేది. కాగ లక్ష్మి వివాహేత‌ర సంబంధానికి రాజు అడ్డువున్నాడ‌ని భావించింది.

త‌న ప్రియుడుతో ముందుగా వేసుకున్న ప‌థ‌కం ప్ర‌కారం.. చీరతో ఉరి వేసి చంపి హ‌త్య చేశారు. రాజు మృత దేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. విచార‌ణ చేయ‌గా అస‌లు నిజం బ‌య‌ట ప‌డింది. నిందితుల‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు త‌ర‌లించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version