మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా మహిళా మణులకు మనసారా శుభాకాంక్షలు తెలియజేయండి. మగువలు మెచ్చే అందమైన కోట్స్‌తో సోషల్ మీడియా మా«ధ్యమాల ద్వారా వారికి షేర్ చేయండి.
మహిళా దినోత్సవం శుభాకాంక్షలు
ఈ సృష్టిలో స్త్రీ లేకపోతే జననం లేదు, గమనం లేదు. అసలు ఈ లోకంలో జీవమే ఉండదు. మనందరిని కంటి పాపల చూసుకుంటూ మన ఇళ్లలోనే ఒక అమ్మలా, అక్కలా , భార్యలా, చెల్లెలా ఇలా పలు రకాలుగా మనల్ని లాలిస్తూ, తోడుంటూ, ముఖ్యంగా భార్యగా భర్తగా వారి బాగోగులు చూసుకుంటుంది. కుటుంబ భారం మోస్తూనే ఈ రోజుల్లో బయటకి వెళ్లి పనులు నిర్వహించుకొని తిరిగి భర్త, పిల్లలు ఇంటికి వచ్చేసరికి ఇంటిని చక్కబెడుతుంది. ఇన్ని పాత్రలు పోషిస్తున్న మహిళా మణులకి మనసారా ధన్యవాదాలు చెప్పకోవడానికి ఇదే సరైన సమయం.
- ‘యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేశతా’
దీనార్థం ఎక్కడైతే స్త్రీని గౌరవిస్తారో అక్కడ దేవలు కొలువై ఉంటారు.– అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. - అమ్మను పూజించు
సోదరిని దీవించు
భార్యను ప్రేమించు, ముఖ్యంగా మహిళను గౌరవించు.
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు - జన నం నీవే.. గమనం నీవే
సృష్టవి నీవే.. కర్తవు నీవే
కర్మను నీవే.. ఈ జగమంతా నీవే..
భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక ప్రతి ఇంట్లో నీ రూపంలో సృష్టించాడు.– మహిళా నీకిదే మా వందనం. - కనులు తెరిచినప్పటి నుంచి బంధం బాధ్యత కుటుంబం కోసం నిరంతరం తపించి, ఆత్మీయతను పంచి, తనవారి భవిష్యత్తుకు బంగారు బాటాలు వేసేందుకు తన వంతు కృషి చేస్తుంది. – మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
- ‘ కార్యేషు దాసి.. కరణేషు మంత్రి..భోజ్యేషు మాత..ఇలా సమస్తం నీవే.
– తల్లి, సోదరి, భార్య .. ఇంకా ఎన్నో రూపాల్లో ప్రేమను పంచుతుంది. ఆమెను గౌరవిద్దాం! ఏ కష్టం రాకుండా కాపాడుదాం! - ఆమె లేకుంటే అంతా శూన్యం
అందుకే ఆమెకు శతకోటి వందనం - ‘ ఆడపిల్లనమ్మా.. అంటూ దిగులు పడకు. ఆడ పులిలా ఈ లోకానికి నీవేంటో నిరూపించు.
- వందలో ఒక్కరు.. కోట్లలో ఒక్కరు.. నన్ను నన్నుగా ప్రేమించిన ఒకే ఒక్కరు అమ్మ– అంతతీయ ఉమెన్స్ డే శుభాకాంక్షలు.
- ఓ మగువా.. నీవు నా జీవిత భాగస్వామివి కావడం నా అదృష్టం.
- మగువా.. మగువా.. లోకానికి తెలుసా నీ విలువ
నిరంతరం కుటుంబం కోసం పరితపించే నీ చలవ.