మహిళా శక్తి : ప్రపంచంలో శక్తిమంతమైన మగువలు వీరే..!

-

ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లోని అధికార హోదాలలో కొందరు మగువలు కొనసాగుతారు. శక్తిమంతమైన మహిళా పాలకులుగా అందరి మన్నన పొందుతున్నారు. దేశ పాలన నిర్వహణలో తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి నారీ శక్తిమణుల గురించి తెలుసుకుందాం..

ఆంగ్ సాన్ సూకీ..

ఆంగ్ సాన్ సూకీ జూన్ 1945లో జన్మించింది. బర్మా దేశ ప్రతి పక్షనాయకురాలు. ప్రముఖ రాజకీయవాది. ‘‘నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ’’ చైర్ పర్సన్ గా కొనసాగుతున్నారు. మయన్మార్ స్టేట్ కౌన్సిలర్ గా 2016 ఏప్రిల్ 6వ తేదీన పదవీ బాధ్యతలు చేపట్టారు. మిలిటరీ.. సైనిక చర్యలు జరిపిన తర్వాత ఆమెను బంధించారు. శక్తివంతమైన మహిళల పాలకుల్లో ఆమె ఉన్నారు.

కాజా కల్లాస్..

ఐరోపాలోని ఎస్తోనియా కాజా కల్లాస్ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. ఎస్తోనియా దేశంలో రాష్ట్రపతి, ప్రధానమంత్రిగా మహిళలే బాధ్యత వహిస్తున్నారు. పురుషులతో పోటీ పడుతూ రాజకీయాల్లోనూ తమదైన ముద్రను వేసుకున్నారు. జనవరి 26 తేదీన కాజా కల్లాస్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

మైయా సందు..

మాల్డోవా అధ్యక్షురాలిగా మైయా సందు కొనసాగుతున్నారు. 24 డిసెంబర్ 2020లో పదవీ బాధ్యతలు చేపట్టారు. మాల్డోవా దేశంలో ఆమె మొదటి మహిళా అధ్యక్షురాలు.

ఇంగ్రిడా సైమొనిట్..

లిథేవేనియా అధ్యక్షురాలిగా ఇంగ్రిడా సైమొనిట్ కొనసాగుతున్నారు. ఈమె 25 నవంబర్ 2020న పదవీ బాధ్యతలు చేపట్టారు.

సన్నా మారిన్..

సన్నా మారిన్ ఫిన్ లాండ్ ప్రధానిగా కొనసాగుతున్నారు. కొన్నేళ్ల కిందటే రాజకీయ రంగంలో ప్రవేశించారు. రాజకీయ రంగంలో ఈమె ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందింది.

జసిందా అర్డెన్..

జసిందా అర్డెన్ న్యూజిలాండ్ ప్రధానమంత్రిగా మరోసారి బాధ్యత చేపట్టారు. అక్టోబర్ లో జరిగిన ఎన్నికల్లో ప్రధానిగా గెలుపొందారు.

షేక్ హసీనా..

షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా కొనసాగుతున్నారు. దివంగత బంగ్లాదేశ్ అధ్యక్షుడు, ఆ దేశ జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ ఐదుగురు సంతానంలో ఈమె పెద్దది. 28 సెప్టెంబర్ 1949లో బంగ్లాదేశ్ లోని తుంగిపరలో జన్మించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version