కరోనా మహమ్మారి నేపధ్యంలో పలు దేశాల్లో ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా నాశనం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రపంచ బ్యాంక్ కీలక అడుగులు వేస్తుంది. ప్రపంచంలోని అత్యంత పేద దేశాలు తట్టుకుని నిలబడటానికి గానూ 25 బిలియన్ డాలర్లను అత్యవసర ఫైనాన్సింగ్ చేయాలని ఆదేశించింది. ప్రపంచ బ్యాంక్ చీఫ్, డేవిడ్ మాల్పాస్ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఆర్థిక మంత్రులు మరియు జి 20 ప్రధాన ఆర్థిక వ్యవస్థల సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లతో మాట్లాడారు. అంతర్జాతీయ అభివృద్ధి సంఘం (ఐడిఎ) అనుబంధ రంగాలకు ఈ నెల చివరిలో అనుబంధ ఫైనాన్సింగ్ ప్యాకేజీని ప్రతిపాదించనున్నట్లు చెప్పారు. తక్కువ ఆదాయ దేశాలలో క్రమంగా ఆర్ధిక మందగమనం పెరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంయుక్త కార్యాచరణ ప్రణాళికను ప్రతిపాదించాయని చెప్పారు.