న్యూజిలాండ్ ఆఫ్ఘన్ మ్యాచ్ మొదటి హాఫ్ లో పోటాపోటీ ఖాయం.. ఏదో సంచలనం జరుగుతుంది అని ఊహించారు. కానీ ఆఫ్ఘన్ ఘోరంగా క్యాచ్ లు వదిలేసి కివీస్ ను ఎక్కువ స్కోర్ చేసేలా హెల్ప్ చేసింది. ఫలితంగా కనీస పోటీ అయిన ఇస్తుందన్న టీం కాస్తా ఏకపక్షముగా మ్యాచ్ మారిపోయింది. న్యూజిలాండ్ ఇచ్చిన 289 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం ఆషామాషీ విషయం కాదు, ఎందుకంటే కివీస్ కు టాప్ బౌలర్లు ఉన్నారు బౌల్ట్, హెన్రీ, ఫెర్గుసన్, శాంట్ నర్ లను ఎదుర్కొని ఈ స్కోర్ ను ఛేదించడం కష్టమే. అయినా కనీస పోరాట పటిమ లేకపోతే ఎలా ? కానీ ఆఫ్గనిస్తాన్ ఇప్పుడు ఆడుతున్న తీరు చూస్తే 200 కి ఆల్ అవుట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓపెనర్లు నిరాశపరచగా… మధ్యలో రహమత్ షా మరియు ఒమర్ జై లు ఆదుకునే ప్రయత్నం చేసినా కివీస్ బౌలర్ల ముందు నిలవలేకపోయారు.
ఫలితం ఇప్పుడు ఆఫ్గనిస్తాన్ ఆరు వికెట్లు కోల్పోయి తీవ్రమైన కష్టాల్లో ఉంది. ఇక గెలవడం మాట అటుంచితే ఓటమి అంతరాన్ని ఎంత తగ్గించుకుంటుంది అన్నది మాత్రమే చూడాలి.