ఈ రోజు ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా మరియు ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ అనుకున్నట్లు జరగలేదని ప్రతి ఇండియా అభిమాని మనసులో అనిపించి ఉంటుంది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘన్ నిర్ణీత ఓవర్ లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఓపెనర్లు మొదటి వికెట్ కు 32 పరుగులు జోడించాక వరుసగా గుర్బాజ్, ఇబ్రహీం మరియు రహమత్ షా ల వికెట్ లను కోల్పోయింది. ఒక దశలో కనీసం 200 పరుగులు అయినా చేస్తుందా అనిపించింది. ఎందుకంటే… 63 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత హస్మతుల్లా షాహిద్ (80) మరియు అజ్మతుల్లా ఒమర్ జై (62) లు నాలుగవ వికెట్ కు 121 పరుగులు జోడించి తమ జట్టును ప్రమాదంలో నుండి బయటపడేశారు. వీరిని అవుట్ చెయ్యలేక బుమ్రా, సిరాజ్, శార్దూల్ మరియు ఇద్దరు స్పిన్నర్లు ఎంత ప్రయత్నించినా కుదరలేదు.
చివరికి హార్దిక్ పాండ్య ఒక స్లో బాల్ తో ఒమర్ జై ను అవుట్ చేసి రికార్డు భాగస్వామ్యానికి తెరదించాడు. ఇక ఇండియా బౌలింగ్ లో బుమ్రా 4 మరియు హార్దిక్ రెండు వికెట్లు తీశారు. ఇండియాకు ఈ స్కోర్ ను ఛేదించడం కష్టం కాకపోయినా మంచి స్పిన్ బౌలింగ్ ఉన్న ఆఫ్ఘన్ తో జాగ్రత్తగా ఉండక తప్పదు.