ఇంగ్లాండ్ మరియు బాంగ్లాదేశ్ ల మధ్యన జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో టోర్నమెంట్ లో మొదటి విజయాన్ని అందుకుంది డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ దుమ్ము దులిపే బ్యాటింగ్ తో బంగ్లాదేశ్ ముందు 365 పరుగులు లక్ష్యాన్ని ఉంచింది. ఇంగ్లాండ్ ప్లేయర్స్ లో డేవిడ్ మలన్ సెంచరీ చేసి మంచి స్కోర్ ను అందించారు. అనంతరం బంగ్లాదేశ్ ఛేజింగ్ లో భాగంగా 227 పరుగులు చేశాక ఆల్ అవుట్ అయింది. ఏ దశలోనూ షకిబ్ సేన విజయం సాధించేలా కనిపించలేదు.. ఇంగ్లాండ్ బౌలర్ల దెబ్బకు మరో 138 పరుగులు ఉండగానే తోక ముడిచింది. ఓపెనర్ లిటన్ దాస్ (76) మరియు రహీం (51) లు అర్ద సెంచరీలు చేసి పర్వాలేదనిపించారు… మిగతా వారంతా కూడా పూర్తి ఆత్మరక్షణలో పడిపోయి ఇంగ్లాండ్ కు భారీ విజయాన్ని అందించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో టాప్లె 4 మరియు వక్స్ 2 వికెట్లు తీసు బంగ్లాను దారుణంగా దెబ్బ తీశారు.
కానీ మొదటి మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఆఫ్ఘన్ పై గెలవడం మరియు ఇంగ్లాండ్ న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడంతో ఇద్దరూ చెరొక విజయంతో ఉన్నారు. ముందు ముందు పోటీ ఇంకా కఠినంగా మారే అవకాశం ఉంది.