కరోనా అనే మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని గజగజలాడిస్తుంది. చిన్న దేశాల నుచి అగ్ర దేశాల వరకు అందరూ దీని బారిన పడ్డవారే. దీని వల్ల ఏర్పడ్డ ఆర్థిక ఇబ్బందుల నుంచి కొలుకోవడానికి చాలా కాలమే పట్టేలా ఉంది. ఈ మహమ్మారి దెబ్బకి ఎన్నో లక్షల మంది మరణించారు. దీనిని అరికట్టేందుకు ప్రపంచ దేశాలన్నీ ఒక్క తాటిపైకి వచ్చి కష్టపడుతున్నాయి. అయినా దీనిని అరికట్టడం సాధ్యమవ్వట్లేదు. ఒక వేల శాస్త్రవేతల కృషి ఫలించి దీనికి విరుగుడు కనిపెట్టినా.. అది అందుబాటులోకి రావడానికి చాలా కాలమే పడుతుంది. అప్పట్లోపు ఇంకా చాలా మంది మరణించే అవకాశం ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఆదివారం కొత్తగా 1,28,585 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో మొత్తం కేసుల సంఖ్య 90,37,140కి చేరింది. అలాగే నిన్న 3,329 మంది కరోనా బారినపడి మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 4,69,595కి చేరింది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 47,96,103గా ఉంది. మరోవైపు మొత్తం 37,71,442గా యాక్టివ్ కరోనా కేసులున్నాయి.
బిగ్ బ్రేకింగ్ : 90 లక్షలకు చేరిన కరోనా కేసులు..!
-