ప్రపంచంలోకల్లా ఎత్తైన శివుడి విగ్రహం ఎక్కడ ఉందో తెలుసా..?

-

హిందువులు శివుడిని పూజిస్తూ ఉంటారు. పైగా చాలా శివాలయాలు కూడా ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లోనే చాలా శివాలయాలు ఉన్నాయి. అలానే భారత దేశంలో చూస్తే కాశీ విశ్వేశ్వరుడి ఆలయం ఇలా ప్రముఖ దేవాలయాలు కూడా ఉన్నాయి అయితే ప్రపంచంలో ఎత్తైన శివుడి విగ్రహం గురించి… అక్కడ విశేషాలు వింతల గురించి ఇప్పుడు చూద్దాం.

369 అడుగుల పరమేశ్వరుని విగ్రహాన్ని ఇక్కడ నిర్మించారు. రాజస్థాన్ రాష్ట్రంలోని రాజ్ సమంద్ జిల్లా నాథ్ ద్వారా పట్టణంలో ఈ విగ్రహం ఉండి. 32 ఎకరాల విస్తీర్ణంలో ఒక కొండపై దీన్ని ఏర్పాటు చేసారు. ఈ శివుడి విగ్రహం మనకి సుమారు 20 కిలోమీటర్ల దూరం నుంచి కూడా క్లియర్ గా కనపడుతుంది.

ఈ శివుడిని నిర్మించేందుకు 2.5 లక్షల క్యూబిక్ టన్నుల కాంక్రీట్, ఇసుకను ఉపయోగించడం జరిగింది. ఈ శివుడి ని దర్శించుకోవడానికి లిఫ్టులు, మెట్లతో ప్రత్యేక రహదారులను కూడా నిర్మించారు. మూడు రకాల మెట్ల మార్గాలు కూడా వున్నాయి. 250 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలి ని తట్టుకునేలా నిర్మించడం విశేషం. అలానే ఇక్కడ జిప్ లైన్, గో కార్డ్, బంగీ జంప్, ఫుడ్ కోర్టులు వున్నాయి. అడ్వెంచర్ పార్క్, జంగిల్ కేఫ్ ని కూడా నిర్మించారు. ఈ విగ్రహ దర్శనానికి కనీసం నాలుగైదు గంటల సమయం పడుతుంది. ఈ విగ్రహం లోపల వున్నా హాలులో ఒకసారి పదివేలు మంది కూర్చోచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version