వావ్ అవిసెగింజలు అందానికి ఇంత అద్భుతంగా పనికొస్తాయా..?

-

ప్రకృతి ప్రసాదించిన వాటిలో ప్రతీదీ అద్భుతమే.. వాటి గురించి పూర్తిగా తెలిసినప్పుడే మనకు ఈ ఫీల్ వస్తుంది. అందానికి, ఆరోగ్యానికి సరిపోయోలా ఉంటాయి. వాటిల్లో ఒకటి అవిసె గింజలు. ఇవి హెల్త్ కు చాలా మంచిదని అందరూ వినే ఉంటారు. ఆరోగ్యానికే కాదు.. అందమైన చర్మానికి, జుట్టుకు కూడా ఇవి చాలా మేలు చేస్తాయి. ఈ గింజల్లో ఉండే ఐరన్, కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టుకు కూడా బాగా ఉపయోగపడతాయి. వీటితో ఫేస్ ప్యాక్ వేసుకుంటే.. చర్మం మెరిసిపోతుంది.

చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ నిరోధించడంలో ఈ గింజలు సహాయపడతాయి. అవిసెగింజలు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయట. ఇందులో అనేక పదార్థాలు చర్మంపై కనిపించే ముడతలు, మచ్చలు, ఇతర వృద్ధాప్య సంకేతాలను వదిలించుకోవడానికి పనిచేస్తాయి. ఇది చర్మాన్ని బిగుతుగా, సహజంగా, యవ్వనంగా చేస్తుంది.
అవిసె గింజల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని మరింత హైడ్రేట్ చేయడానికి, లోపల తేమను నిలుపుకోవడానికి సహాయపడతాయి. అవిసె గింజలు మొటిమలను కూడా తగ్గిస్తాయి. ఇవి శరీరంలోని ఈస్ట్రోజెన్ స్థాయిని సమతుల్యం చేస్తాయి.
 అవిసె గింజలతో ఫేస్ మాస్క్ ఎలా చేయాలంటే..
కొన్ని ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోని..వాటిని నీటిలో నానబెట్టండి. వీటికి ముల్తానీ మిట్టిని కలిపి పేస్ట్‌లా చేయండి. అలాగే ఈ మిశ్రమానికి ఒక టేబుల్ స్పూన్ తేనె కూడా కలపండి. దీనిని ముఖంపై అప్లై చేసుకుని.. కాసేపు అలాగే ఉంచి ఆపై నీటితో శుభ్రం చేసుకోండి. ఇది మీ చర్మాన్ని మెరిసేలా చేయడంలో సూపర్‌గా పనిచేస్తుంది.
దీంతోపాటు.. ఫ్లాక్స్ సీడ్స్ జెల్ ను ఫేస్ కి గ్లిజరిన్ లా కూడా వాడుకోవచ్చు. కొన్ని గింజలను తీసుకుని వాటర్ వేసి.. స్టవ్ మీద ఉంచితే.. అవి జెల్ గా మారుతాయి. ఆపేసి.. చల్లారిన తర్వాత వడకట్టి.. ఆ జెల్ ను ఫేస్ కు రాసుకుంటే.. ముఖం సూపర్ గ్లోయింగ్ వస్తుంది. ఇంకా రెగ్యులర్ గా ఈ జెల్ ను కనుబొమ్మలకు అప్లై చేయడం వల్ల.. ఒత్తుగా పెరుగుతాయి. కొందరికి ఐబ్రోస్ చాలా పలుచగా ఉంటాయి. వారు ఈ చిట్కా పాటించేయొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version