వావ్.. గ్రేట్ ఐడియా..రైతుల కోసం కొత్త యంత్రం..

-

కష్టం నుంచే కసి పుడుతుంది..దాంతో పాటే ఆలోచన కూడా పుడుతోంది..రైతుల కష్టాలను చూసి చలించి పోయిన ఓ వ్యక్తి వినూత్న ఆలొచనకు శ్రీకారం చుట్టాడు..రైతుల కోసం ఏదో చేయాలన్న ఆలోచన మదిలో తట్టింది ఆ యువ శాస్త్రవేత్తకు..మెదడుకు పదును పెట్టి, వరి నాటు వేసే యంత్రాన్ని తయారు చేసి తన ప్రతిభను చాటుకున్నాడు..

వివరాల్లొకి వెళితే..కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన పేద రైతు కుటుంబానికి చెందిన కమ్మరి నాగ స్వామి చిన్నప్పటి నుండే ప్రయోగాల పై ఆసక్తి చూపేవాడు. స్కూల్లో చదువుకునేటప్పుడు నుంచి ప్రయోగాలు చేసి తన మేధాశక్తిని బయటకు తీయాలని ఆరాట పడే వాడు. కానీ ఆర్థిక పరిస్థితులు అనుకూలించక పోవడం, పేదరికం వెంటాడుతుండంతో హైదరాబాద్‌లో పనిచేస్తూ జీవనం గడుపుతున్నాడు. ఈ పరిస్థితుల్లో కరోనా తీవ్ర ప్రభావం చూపడం, ఉపాధి కోల్పోవడంతో చేసేదేమీలేక తిరిగి స్వగ్రామానికి వచ్చాడు. గ్రామీణ ప్రాంతాల్లో లేబర్ సమస్య అధికంగా ఉండటం, నాట్లు వేసేందుకు కూలీ రేట్లు అధికంగా ఉండడం, పెట్టుబడి పెరిగిపోవడంతో నాటు వేసే యంత్రాన్ని తయారు చేయాలనే ఆలోచన వచ్చింది..

అందుకోసం దాదాపు రెండేళ్ళు శ్రమించి మరీ నాటు వేసే యంత్రాన్ని తయారు చేయడంలో సక్సెస్ అయ్యాడు.. వ్యవసాయ భూమిలో ఆదివారం తాను తయారు చేసిన నాటు వేసే యంత్రం ద్వారా పొలంలో నాటు వేసి అందరి మన్ననలను పొందాడు. ఈ యంత్రం తయారీ కి సుమారు 50-55 వేల రూపాయలు ఖర్చు అయినట్లు చెప్పారు.

గ్రామస్తుల సహకారం, ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే మరిన్ని ప్రయోగాలు రైతుల కోసం చేస్తానని ఈ సందర్భంగా నాగ స్వామి గ్రామస్థుల సమక్షంలో సంతోషం వ్యక్తం చేశారు. నాటు వేసే యంత్రం ని తయారు చేసిన స్వామిని అభినందించిన వారిలో ఎంపీపీ అధ్యక్షులు జాoగారి గాల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ తొగరి సులోచన సుదర్శన్, డిసిసిబి డైరెక్టర్ లింగాల కిష్టాగౌడ్, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మర్రి మహిపాల్ మొదలగు వారు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version