ఖైరతాబాద్ ఎమ్మెల్యే అత్యుత్సాహం.. ఫ్లెక్సీలో తప్పుగా ఇండియా మ్యాప్!!

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మారుస్తూ అధికారిక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దసరా పండుగ సందర్భంగా జాతీయ పార్టీగా తెరాస పార్టీని మార్చారు. ఈ క్రమంలో జాతీయ పార్టీ పేరిట నగరంలో ఫ్లెక్సీలు వెల్లువెత్తాయి. ఈ మేరకు ఖైరతాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా సోమాజిగూడ సిగ్నల్ దగ్గర ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంతో అది కాస్త వివాదానికి దారి తీసింది.

ఖైరతాబాద్ ఎమ్మెల్యే-ఫ్లెక్సీ

ఈ ఫ్లెక్సీలో ఇండియా మ్యాప్‌పై సీఎం కేసీఆర్ ఫోటోను చిత్రీకరించారు. అలాగే ‘దేశంలో ఎంత మంది ఉన్నా కేసీఆర్ లాంటి ఒక్క ఆలోచనపరుడు ఉంటే చాలు’ అంటూ రాసుకొచ్చారు. అయితే ఈ ఫ్లెక్సీలో మ్యాప్‌ను తప్పుగా ప్రింట్ చేశారు. గుజరాత్, కశ్మీర్ భూభాగాలను విడగొట్టినట్లు కనిపిస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోను సాగర్ గౌడ్ అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. దీంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండియా మ్యాప్ రూపురేఖలే మార్చేస్తున్నారని మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version