ప్రముఖ WWE స్టార్ జేమ్స్ హ్యారిస్ కన్నుమూశారు. ఆయన అప్పట్లో ‘కమలా’గా ఫేమస్ అయ్యారు. కాగా హ్యారిస్ వయస్సు 70 ఏళ్లు. అప్పట్లో WWE ని WWFగా వ్యవహరించేవారు. ఆయన 1984లో WWF లో చేరారు. 1980లలో ఆయన కెరీర్ పీక్ దశలో ఉండేది.
జేమ్స్ కమలా హ్యారిస్ అప్పట్లో హల్క్ హాగన్ సహా పలువురు WWF స్టార్లతో రింగ్‌లో పోటీ పడ్డారు. ఆండ్రూ ది జియాంట్‌తో 1984లో ఓ సిరీస్ మ్యాచ్‌లలో పాల్గొన్నారు. ఇక WWF మ్యాచ్‌లలో హ్యారిస్ వేషధారణ భయం గొలిపేలా ఉండేది. రింగ్‌లోకి కాళ్లకు ఏమీ లేకుండానే వచ్చేవాడు. అలాగే యుద్ధం పెయింట్ వేసుకునేవాడు. ఆఫ్రికన్ మాస్కు ధరించేవాడు. చేతిలో ఈటను ధరించి భయం గొలిపే విధంగా రింగ్‌లో బరిలోకి దిగేవాడు.
హ్యారిస్ ఇటీవలి కాలంలో తీవ్ర అనారోగ్య సమస్యలకు లోనయ్యారు. డయాబెటిస్ కారణంగా ఆయన రెండు కాళ్లను ఇప్పటికే కోల్పోయారు. ఈ క్రమంలో అనారోగ్య సమస్యలు ఎక్కువ కావడంతో ఆయన చనిపోయారు. అప్పట్లో WWF స్టార్ హల్క్ హాగన్ సూచనతో హ్యారిస్ World Championship Wrestling (WCW)లోనూ 1995లో పాల్గొన్నాడు.