యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి 11 రోజుల వరకు ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి.ఇప్పటికే ఆలయ అధికారులు అన్ని ఏర్పాటు చేశారు.లక్ష్మీనృసింహుడి క్షేత్రాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు.ఈసారి స్వర్ణ విమాన గోపురం కలిగి కొత్త అనుభూతితో ఉత్సవాలు జరగనున్నాయి.
మార్చి 1న స్వస్తి వచనంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు 7వ తేదీ స్వామి అమ్మవారి ఎదుర్కోళ్ల ఉత్సవం, 8వ తేదీ తిరు కల్యాణ మహోత్సవం, 9వ తేదీ దివ్య విమాన రథోత్సవాన్ని నిర్వహించనున్నారు.11న గర్భాలయంలోని మూల విరాట్లకు నిర్వహించే సహస్ర ఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. బ్రహోత్సవాల నేపథ్యంలో ఈనెల 11 వరకు స్వామివారి నిత్యకల్యాణం,శ్రీ సుదర్శన నారసింహ హోమం నిర్వహిస్తామని ఆలయ ఈవో తెలిపారు.