చిరు భార్యను అలా పిలవడం తప్పే.. కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు.. యండమూరి

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నవలా రచయితగా యండమూరి వీరేంద్రనాథ్ మంచి పేరు ప్రఖ్యాతులు పొందారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. తన జీవితంలో ఎప్పుడూ కూడా చెడు అలవాట్లకు బానిస కాలేదని. కేవలం అప్పుడప్పుడు మాత్రమే ఒక సిగరెట్ తాగే వాడినని తెలియజేశారు. కొంతమంది వీటివల్లే తన కెరీర్ ని నాశనం చేసుకుంటూ ఉంటారని యండమూరి తెలియజేశారు. అశ్వినీ దత్ ఏ చిత్రాన్ని మొదలు పెట్టినా కూడా కచ్చితంగా ఆయన న్యూమరాలజీ ని ఫాలో అవుతారని తెలియజేశారు.

అలా శక్తి సినిమా గురించి.. ముందుగా అశ్వినీదత్ తనకే చెప్పారని తెలియజేశారు. అయితే కథ నచ్చినప్పటికీ అందులో ఫాదర్ రోల్ చాలా రొటీన్ గా ఉందని చెప్పినా కూడా ఆయన వినలేదని తెలియజేశారు యండమూరి. ఇక అప్పట్లో ఎక్కువగా నటీనటులు సర్జరీలు చేయించుకునేవారు అని , అది ఒక కామన్ విషయం అని కూడా తెలియజేశారు. ఇక శ్రీదేవి సర్జరీ చేయించుకున్న విషయం అప్పుడు చాలా వైరల్ గా మారి పేపర్లో కూడా రావడం జరిగిందని తెలిపారు. ఇక రామ్ చరణ్ పై చేసిన కామెంట్స్ నెగటివ్ కాదని.. అల్లు అర్జున తనకి క్లోజ్ అని యండమూరి తెలియజేశారు.

ఇక తన దృష్టిలో యాక్టింగ్ వేరు, స్టార్ పొజిషన్ వేరు అని తెలియజేశారు. ఏ హీరో అయినా సరే డిఫరెంట్ రోల్స్ ను చేస్తేనే ఆయనను సంపూర్ణ నటుడిగా భావిస్తారని యండమూరి తెలియజేశారు.సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ తమ్ముడిగా పేరుపొందిన నాగబాబుని తన చిన్న వయసు నుంచే ఎత్తుకొని పెంచానని తెలియచేశాడు. ఇక పవన్ కళ్యాణ్ అప్పటికి ఇంకా చాలా చిన్న పిల్లవాడని యండమూరి తెలిపారు. చిరంజీవి భార్యను అప్పట్లో గారు అని పిలవకపోవడం నా తప్పే అని లెంపలు వేసుకుంటున్నాను అని తెలియజేశారు. అయితే ఆ విషయం ఇలా వైరల్ అవుతుంది అని తనకు తెలియదని తెలియజేశారు. రామ్ చరణ్ తో పోలిస్తే దేవి శ్రీ ప్రసాద్ కేవలం టాలెంట్ తోనే పైకి వచ్చాడని ఆయన తెలియజేశారు. యండమూరు చేసిన ఈ కామెంట్ చాలా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version