గుంటూరులో వైసీపీ ఫ్లెక్సీలు చించివేత.. భారీగా పోలీసుల మోహరింపు

-

ఏపీలోని గుంటూరు జిల్లాలో సంక్రాంతి పండుగ సందర్భంగా వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపివేశారు. దీంతో జిల్లాలోని పెద్దకూరపాడులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావు వైసీపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపివేయడంతో పాటు అడ్డుకోబోయిన కార్యాలయ సిబ్బందిపై దాడికి పాల్పడినట్లు సమాచారం.

గుర్తుతెలియని వ్యక్తుల దాడిలో గాయపడిన నరేందర్ అనే వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పెద్దఎత్తున అక్కడ పోలీసులను మోహరించారు. అధికార పార్టీ నాయకులే ఈ దాడికి పాల్పడ్డారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ.. పరిస్థితులు ఇలాలనే ఉంటే తామూ తిరగబడతామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version