ఏపీలో అధికార వైసీపీలో అంతర్గత పోరు బయటపడుతూనే ఉంది. చాలా స్థానాల్లో నేతల మధ్య పోరు నడుస్తోంది..ఇటు శ్రీకాకుళం నుంచి చూసుకుంటే అటు చిత్తూరు జిల్లా వరకు రచ్చ నడుస్తూనే ఉంది. ఓ వైపు జగన్ పథకాలు ఇస్తూ ప్రజలని ఆకట్టుకోవాలని చూస్తుంటే…మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు సొంత పోరుతో పార్టీకి నష్టం తెస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్తితి కనిపిస్తుంది.
గత కొన్ని రోజుల్లోనే పలు స్థానాల్లో అంతర్గత పోరు బయటపడిన విషయం తెలిసిందే. పలాసలో మంత్రి అప్పలరాజుకు వ్యతిరేకంగా కొందరు వైసీపీ నేతలు ఉన్నారు. ఆయనకు సీటు ఇస్తే తామే ఓడిస్తామని అంటున్నారు. ఇటు శృంగవరపుకోటలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు విషయం కూడా అంతే..ఆయనపై సొంత నేతలు..అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేని తామే ఓడిస్తామని అంటున్నారు. ఇటు అనకాపల్లిలో మంత్రి అమర్నాథ్, మాజీ మంత్రి దాడి వీరభద్రరావుల మధ్య రచ్చ నడుస్తుంది. అటు పాయకరావుపేటలో ఎమ్మెల్యే గొల్ల బాబూరావుని సొంత పార్టీ వాళ్లే వ్యతిరేకిస్తున్నారు.
పెందుర్తిలో ఎమ్మెల్యే అదీప్, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుల మధ్య పోరు నడుస్తోంది. రాజోలులో ఎమ్మెల్యే వరప్రసాద్‌పై వైసీపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఇటు విజయవాడలో ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, సామినేని ఉదయభానుల మధ్య వార్ నడుస్తుంది. గుంటూరులో చాలా స్థానాల్లో రచ్చ ఉంది.
అటు చీరాల, పర్చూరు, అద్దంకి, కొండపి లాంటి స్థానాల్లో ఇదే పంచాయితీ..నెల్లూరు జిల్లాలో చెప్పాల్సిన పని లేదు. అక్కడ మామూలు రచ్చ కాదు. జగన్ సొంత జిల్లా కడపలో పలు సీట్లలో వైసీపీ నేతల మధ్య పోరు ఉంది. కర్నూలు, అనంత జిల్లాల్లో కూడా కొన్ని స్థానాల్లో ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ పోరు వల్ల జరిగే డ్యామేజ్‌ని జగన్ ఇమేజ్ కూడా కాపాడలేదనే పరిస్తితి.