రాజధాని రచ్చ.. వైసీపీ అదిరిపోయే స్కెచ్..!

-

ఏపీలో రాజధాని అంశంలో రచ్చ నడుస్తూనే ఉంది..ఎప్పుడైతే అమరావతిని కాదని జగన్..మూడు రాజధానులు అని ప్రకటించారో అప్పటినుంచి రాజధానిపై రచ్చ జరుగుతూనే ఉంది. ఓ వైపు అమరావతిని రాజధానిగా ఉంచాలని, ఆ ప్రాంత రైతులు, టీడీపీ, ఇతర పార్టీలు పోరాడుతున్నాయి. ఇటు వైసీపీ మాత్రం మూడు రాజధానులు అంటుంది. సరిగా మూడు రాజధానుల బిల్లు రూపొందించకపోవడం, న్యాయ పరమైన చిక్కులతో కోర్టులో మూడు రాజధానుల బిల్లు నిలవలేదు.

ఇదిలా ఉండగానే అమరావతి కోసం ఆ ప్రాంత రైతులు, ప్రజలు శ్రీకాకుళంలోని అరసవెల్లి వరకు పాదయాత్ర మొదలుపెట్టారు. ప్రస్తుతం యాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతుంది. అయితే ఎప్పుడైతే విశాఖలోకి పాదయాత్ర వస్తుందో..అప్పుడు ఖచ్చితంగా అడ్డుకుని తీరుతామని వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వార్నింగ్ ఇస్తున్నారు. విశాఖలో గొడవలు చేయడానికి వస్తున్నారని మాట్లాడుతున్నారు. అసలు అమరావతి రైతులు ఏమో…వారి దారిలో వారు యాత్ర చేసుకుంటూ వెళుతున్నారు. కానీ గొడవ కోసం ఎవరూ చూస్తున్నారనేది దీని బట్టి అర్ధమవుతుంది.

ఇక ఉత్తరాంధ్రలో వైసీపీ నేతలు..ఇతర ప్రజా సంఘాలు, విద్యార్ధులుతో కలిసి ఓ జే‌ఏ‌సిని ఏర్పాటు చేసుకున్నారు. కాకపోతే ఈ జే‌ఏ‌సి పూర్తిగా వైసీపీదే అందులో డౌట్ లేదు. ఇక వీరి పని విశాఖ రాజధాని కోసం పోరాటం అంటున్నారు. అలాగే అమరావతి వాళ్ళని అడ్డుకుంటామని చెబుతున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..విశాఖకు రాజధాని రావాలనే అంశంలో వైసీపీ నేతలు చేస్తున్నంత హడావిడి..అక్కడి ప్రజల్లో కనిపించడం లేదు.

వారు మాత్రం ఏదొకటి ముందు ఒక రాజధాని ఉంటే చాలు అని భావిస్తున్నారు..విశాఖకు రాజధాని వస్తే మంచిదే అని కూడా అనుకుంటున్నారు. కానీ వైసీపీ చెప్పి మూడేళ్లు అయిన రాజధాని లేదు. పైగా కోర్టులో ఎదురుదెబ్బలు..దీంతో రాజధాని ఇప్పటిలో అయ్యే పని కాదని అక్కడి ప్రజలు ఉన్నట్లు తెలుస్తోంది. పైగా ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది..మరి తర్వాత వేరే పార్టీ అధికారంలోకి వస్తే పరిస్తితి ఏంటి అనేది డౌటే. పైగా ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉంది..అలాంటప్పుడు వైసీపీ చేసే ఈ పోరాటం ఎంతవరకు సక్సెస్ అవుతుంది..అమరావతి వాళ్ళని ఎంతవరకు నిలువరించగలుగుతారు అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version