రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ లో రెండు రోజుల నుంచి భగ వద్రామానుజల సహస్రాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ రామానుజా చార్యలు 216 అడుగుల విగ్రహం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆవిష్కరణకు సన్నాహాలు పూర్తి అయ్యాయి. ముచ్చింతల్ గ్రామంలోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలోని 40 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరుగుతోంది.
ఈ కార్యక్రమానికి నిన్న సాయంత్రం ఐదు గంటల సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గ్రామానికి చేరుకున్నారు. తన కుటుంబ సమేతంగా ముచ్చింతల్ గ్రామానికి చేరుకున్నారు సీఎం కేసీఆర్. అయితే ఈ నేపథ్యంలోనే వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా కూడా ముచ్చింతల్ గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ను కలిసారు ఎమ్మెల్యే రోజా.
అలాగే ముచ్చింతల్ గ్రామంలో జరుగుతున్న ఏర్పాట్లను వారిద్దరూ చర్చించారు. ముఖ్యంగా శ్రీ రామానుజాచార్యుల విగ్రహం, దాన్ని ప్రతిష్ట పై మాట్లాడుకున్నారు. అనంతరం ఫోటోలు దిగారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా రేపు ఉచిత గ్రామానికి ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు తెలంగాణ రాష్ట్ర అధికారులు.