ఓ వైపు ఉద్యోగుల ఆందోళన…మరో వైపు జిల్లాల విభజనపై జనం నిరసన..ఇవే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో బాగా హాట్ టాపిక్ అయ్యాయి. పీఆర్సీ విషయంలో ఉద్యోగుల ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. అలాగే 13 జిల్లాలని కాస్త 26 జిల్లాలుగా మార్చారు. అయితే కొన్ని చోట్ల జిల్లాల విభజన ప్రక్రియ సరిగ్గా జరగలేదని చెప్పి జనం రోడ్ల మీదకు వస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల జిల్లాల విభజన అంశంపై పెద్ద ఎత్తున రచ్చ నడుస్తోంది. అలాగే జిల్లాల పేర్లు విషయంలో కూడా రగడం ఉంది. ఇక కొత్త జిల్లాల కేంద్రాల విషయంలో కూడా ఇబ్బందులు తలెత్తాయి.
అయితే బాలయ్య చేస్తున్న డిమాండ్‌ని జగన్ తీరుస్తారా? లేదా? అనేది ఇప్పుడు చర్చగా మారిపోయింది. ఇప్పటికే జిల్లాల విభజనపై సమస్యలు ఉంటే మార్పులు సూచించాలని ప్రభుత్వం ప్రజలని కోరింది. ప్రజలు పెద్ద ఎత్తున మార్పులు సూచిస్తున్నారు. అలాగే కొన్ని మార్పులని ప్రభుత్వం సైతం అంగీకరిస్తుంది. అదే సమయంలో తన అభిమాన హీరో బాలయ్య అడిగే మార్పులని సైతం జగన్ అంగీకరించే పరిస్తితి ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ బాలయ్య డైరక్ట్ జగన్‌తో మాట్లాడితే…ఈ మార్పు జరగొచ్చని అంటున్నారు. అప్పుడు బాలయ్య డిమాండ్‌కు జగన్ ఖచ్చితంగా ఓకే చెబుతారని అంటున్నారు. మరి చూడాలి బాలయ్య డిమాండ్‌ని జగన్ తీరుస్తారో లేదో?