ఈ చిత్రం కచ్చితంగా ఆస్కార్ సాధిస్తుంది: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

-

ఇటీవల ఓ కథనంలో టాలీవుడ్ చిత్రం ఆర్ఆర్ఆర్ గురించి ప్రముఖంగా పేర్కొంది. హాలీవుడ్ ఎంటర్టయిన్ మెంట్ మ్యాగజైన్ ‘వెరైటీ’ ఈ సినిమా పలు విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లను పొందే అవకాశం ఉందన్నది ఆ కథనం సారాంశం. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ గీతం కేటగిరీల్లో ఆర్ఆర్ఆర్ పోటీ పడొచ్చని ‘వెరైటీ’ పేర్కొంది. దాంతో తెలుగు ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ లోనూ సత్తా చాటాలని కోరుకుంటున్నారు.

 

ఈ క్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా స్పందించారు. ఆర్ఆర్ఆర్ చిత్రం హాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుందని వెల్లడించారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఆస్కార్ బరిలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఉండొచ్చన్న హాలీవుడ్ మ్యాగజైన్ అంచనాలు మన తెలుగు చిత్ర స్థాయిని చాటిచెబుతున్నాయని తెలిపారు ఎంపీ విజయసాయిరెడ్డి. గిరిపుత్రులు బ్రిటీష్ వారిపై జరిపిన పోరాటమే ఇతివృత్తంగా సాగిన ఈ చిత్రం కచ్చితంగా ఆస్కార్ సాధిస్తుందని ఆశిస్తున్నా అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version