టార్గెట్ 33: వైసీపీ లీడ్ తగ్గిందా?

-

ఓ వైపు జగన్…వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవాలని టార్గెట్ గా పెట్టుకున్నారు…మరో వైపు ఏమో ఎమ్మెల్యేలు ఆ దిశగా మాత్రం పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. జగన్ ఇప్పటికే చెప్పారు…తాను ఒక్కడినే పనిచేస్తే సరిపోదు అని, ఎమ్మెల్యేలు కూడా కష్టపడి పనిచేయాలని, ప్రజా మద్ధతు పెంచుకోవాలని అప్పుడే 175కి 175 సీట్లు వస్తాయని చెప్పారు.

కానీ ఎమ్మెల్యేల్లో పెద్దగా మార్పు వచ్చినలు కనిపించడం లేదు…జగన్ క్లాస్ తీసుకున్నాక కూడా కొందరిలో మార్పు కనబడటం లేదు. ఇప్పటికీ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారు…అలాగే ప్రజా మద్ధతు పెంచుకోవడం కాదు గాని…ఇంకా పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా కృష్ణా-గుంటూరు జిల్లాల్లోని వైసీపీ ఎమ్మెల్యేలు డేంజర్ జోన్ లో ఉన్నారని పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ రెండు జిల్లాల్లో టీడీపీకి బలమైన నాయకత్వం, క్యాడర్ ఉండటం కావొచ్చు…అలాగే వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం, ఇక రాజధాని విషయంలో ప్రజలు అసంతృప్తిగా ఉండటం…ఇంకా పన్నుల భారం పెరగడం.

ఇలా పలు కారణాల వల్ల కృష్ణా-గుంటూరు జిల్లాల్లో వైసీపీ బలం బాగా తగ్గిందని సర్వేల్లో తేలింది. గత ఎన్నికల్లో రెండు జిల్లాల్లో వైసీపీ మంచి ఫలితాలు రాబట్టింది. గుంటూరులో 17 సీట్లు ఉంటే 15, కృష్ణాలో 16 సీట్లు ఉంటే 14 సీట్లు గెలుచుకుంది. పైగా రెండు జిల్లాలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ వైపుకు వచ్చారు. దీంతో 33 సీట్లకు గాను వైసీపీ బలం 31 ఉండగా, టీడీపీకి 2 సీట్లు ఉన్నాయి.

కానీ ఈ సారి ఎన్నికల్లో రెండు జిల్లాల్లో వైసీపీకి భారీ నష్టం జరుగుతుందని తెలుస్తోంది…ఇటీవల పీకే టీం పేరిట వచ్చిన సర్వేలో రెండు జిల్లాల్లో కలిపి 33 సీట్లు ఉంటే..వైసీపీ 12-14 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. అంటే సగం సీట్లు కూడా కాదు..మిగిలిన సీట్లలో టీడీపీకి గెలుపు ఛాన్స్ ఉందని తేలింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే…టీడీపీ-జనసేన పొత్తుపై సర్వే జరగలేదు. అంటే రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే వైసీపీ పరిస్తితి ఏం అవుతుందో ఊహించుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే కృష్ణా-గుంటూరు జిల్లాల్లో టీడీపీదే లీడ్ అని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version