దివ్యవాణి అనే నటి టీడీపీని వీడాక తప్పులు చేయలేదు. టీడీపీ ని వీడుతూ వీడుతూ తప్పులు చేశారు.ఆ క్రమంలో ఓ జర్నలిస్టును ఇడియట్ అని తిట్టారు. కొన్ని సార్లు తన కోపంకు అంతే లేదని నిరూపించి ఏడ్చి ఏడ్చి వెళ్లారు. ఆ విధంగా ఆమె కాస్త ఫెయిల్. ఆ జర్నలిస్టు ఎవరు అని పేరు కనుక్కొని మరీ! ఓ వెతుకులాట అంతా చేశారు. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా అలానే ఆలోచించారు. పలు పేర్లను ట్యాగ్ చేస్తూ ఏవేవో విన్యాసాలు చేశారు. ఆఖరికి ఆమె ఆ పేరు ఎవరిది అన్నది చెప్పి తప్పుకున్నారు.ఆ విధంగా ఆమె ఫెయిల్. వైసీపీ హిట్.
టీడీపీకి రాజీనామా చేశాక నటి దివ్యవాణి వాడిన భాషపైనే అభ్యంతరాలు వస్తున్నాయి. ఆ పార్టీలో ఉండడం, ఉండకపోవడం లేదా వైదొలగడం అన్నవి ఆమె తీసుకున్న స్వీయ నిర్ణయాలు. వాటిపై ఎవ్వరికీ అభ్యంతరం ఉండదు కానీ ఆమె వాడిన భాష మాత్రం ఇప్పుడు తీవ్ర చర్చకు తావిస్తోంది. ఆఖరికి వైసీపీ సోషల్ మీడియా నానా యాగీ చేయడంతో ఆమె ఎవరిని ఉద్దేశించి తిట్టారో కూడా చెప్పేశారు. దీంతో ఇప్పుడీ చర్చ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఆమె తిట్టింది ఏబీఎన్ వెంకట కృష్ణ ని అనుకుని చాలా మంది మథనపడ్డారు. తరువాత చాలా మంది పేర్లతో వైసీపీ ట్రోల్స్ చేయడంతో ఆఖరికి ఆమె అసలు పేరు వెల్లడి చేశారు. తాను జర్నలిస్టు సాయిని ఉద్దేశించి వ్యాఖ్యానించానని అన్నారామె. తనను ఉద్దేశించి పార్టీ తనకు అప్పగించిన అధికార ప్రతినిధి అనే పదవికి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు తన యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా చేయడంతోనే ఈ కథంతా వెలుగులోకి వచ్చింది.
వాస్తవానికి ఎప్పటి నుంచో పార్టీకి దూరంగానే ఆమె ఉంటున్నారు. అదేవిధంగా మహానాడులో ఆమెను మాట్లాడించకపోవడం కూడా పెద్ద నేరమూ కాదు ఘోరమూ కాదు. అప్పటి మంత్రులెవ్వరికీ పెద్దగా మాట్లాడే ఛాన్సే రాలేదు. జగన్ ప్రభుత్వం వచ్చాక అక్రమ కేసులలో ఇరుక్కున్న చింతమనేనికి కూడా మాట్లాడే అవకాశం రాలేదని, ఈమెకు ఎందుకని అంత అసహనం అని అంటూ సోషల్ మీడియాలో టీడీపీ అభిమానులు వ్యాఖ్యలు చేస్తున్నారు. టీడీపీ నేత (సీనియర్) బండారు సత్యనారాయణ లాంటి వారి కుమారులే వాటర్ బాటిల్స్ సెర్వ్ చేస్తూ.. కార్యకర్తలతో సమానంగా పనిచేశారన్నారంటున్నారు వారంతా! మహానాడు లో పార్టీకి సంబంధించి కానీ సభకు సంబంధించి కానీ ఆమె ఏ నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు వారంతా ! పార్టీ లో ఆమె ఉన్నా లేకపోయినా వచ్చిన నష్టమేం లేదు కానీ వెళ్లేటప్పుడు కాస్త నోరు జాగ్రత్త పెట్టుకుని వెళ్తే మంచిదన్న భావన ఒకటి వ్యక్తం అవుతోంది అటు టీడీపీ శ్రేణుల్లోనూ ఇటు మీడియా వర్గాల్లోనూ..