బెంగళూరు: కర్ణాటక ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా యడియూరప్ప కొనసాగనున్నారు. ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. ఈ సందర్భంగా యడియూరప్ప కర్ణాటక ఆపద్ధరమ్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ కోరారు. కొత్త సీఎంను ఎన్నుకుని, బలం నిరూపించుకునే వరకు ముఖ్యమంత్రిగా కొనసాగాలని యడియూరప్పను గవర్నర్ కోరారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందించారు. కొత్త ముఖ్యమంత్రి కొలువుదీరే వరకూ యడియూరప్ప ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పని చేయనున్నారు.
కాగా రాష్ట్రంలో ఏర్పడిన పరిణామాలతో యడియూరప్ప సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆయన కర్ణాటక ముఖ్యమంత్రిగా నాలుగుసార్లు పని చేశారు. యడియూరప్ప లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన నేత. లింగాయత్ వర్గానికి చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రి అయితే పార్టీకి ఢోకా ఉండదని పలువురు బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.