ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కరెంటు కోతలు తప్పడం లేదు. ఏపీలో అప్రకటిత కరెంటు కోతలతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని రోజులుగా విద్యుత్ డిమాండ్ సుమారు 200 మిలియన్ యూనిట్లుగా ఉంది. దీనికి అనుగుణంగా సరఫరా లేకపోవడంతో లోడ్ రిలీఫ్ పేరుతో కోతలు విధిస్తున్నారు.
ఈ నెల ప్రారంభం నుంచే ఇదే పరిస్థితి ఉంది. కొన్ని రోజులుగా గ్రిడ్ గరిష్ట డిమాండ్ మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు గంటల మధ్య సుమారు 11 వేల 500 మెగావాట్లూగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ గ్రీడ్ పై భారం జరుగుతుందని అధికారులు కూడా చెబుతున్నారు.
దీని వల్ల కొన్ని చోట్ల వ్యవసాయానికి ఒకేసారి తొమ్మిది గంటలు కాకుండా మధ్యలో రెండు గంటల పాటు నిలిపివేసే మరోదఫా చేస్తున్నారు. ఈ నెలలో ఇప్పటివరకు మూడు రోజులే విద్యుత్ కోతల నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. మిగిలిన రోజుల్లో వ్యవసాయ, గ్రామీణ అలాగే మున్సిపల్ ప్రాంతాల్లో కోతలు తప్పడం లేదు. మరికొన్ని రోజులు ఇలాంటి పరిస్థితి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.