తెల్లజుట్టును వీటితో మీకు నచ్చిన రంగులోకి మార్చుకోవచ్చు..!

-

ఇంతకుముందు జుట్టు నల్లగా ఉండాలి అనుకునేవాళ్లు.. కానీ ఇప్పుడు స్టైల్‌ మారింది.. జుట్టు రంగు కూడా మారింది.. కాస్త గోధమ రంగు,ఎరుపు, నారింజ ఇలాంటి కలర్స్‌ ఉంటే.. స్టైల్‌గా పాష్‌గా కనిపిస్తారు.. వీటికోసం పార్లర్స్‌లో హైలెట్స్‌ కూడా వేయించుకుంటారు. పార్లర్‌లో ఒక్కచోట హైలెట్ కలర్‌ వేయాలంటే..500 మినిమమ్‌ తీసుకుంటారు. ఇంకా మీకు వైట్‌ హెయిర్‌ ఎక్కువగా ఉంటే.. ఈ ఇంటి చిట్కాలతో మీ జుట్టును నచ్చిన రంగులోకి మార్చేయొచ్చు..

ఈ మధ్య కాలంలో జుట్టు నెరిసిపోవడం ఎక్కువ మందిలో కనిపిస్తున్న సమస్య. ఒత్తిడి, ధూమపానం, విటమిన్లు, మినరల్స్ లోపించిన పేలవమైన ఆహారం, హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్ వంటి వ్యాధుల కారణంగా జుట్టు తెల్లగా మారిపోతుంది. జుట్టుకు రంగుని ఇచ్చే మెలనిన్ అనేది క్షీణించడం వల్ల జుట్టు నెరిసిపోతుంది. మెలనిన్ ఉత్పత్తి తగ్గడం వల్ల హెయిర్ ఫోలికల్స్ దెబ్బతింటాయి. లేదంటే చనిపోతాయి. దాని వల్ల జుట్టు నెరిసిపోతుంది.

వృద్ధాప్యంలో జుట్టు రంగు మారిపోవడం సహజమే. అటువంటి సమయంలో వెంట్రుకలు నల్లగా మార్చుకోవడం కష్టం. కానీ చిన్న వయసులోనే జుట్టు తెల్లగా అయితే మాత్రం వాటిని సహాజసిధ్దంగా చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. జీవనశైలిలో మార్పులు చేసుకోవచ్చు. ఒత్తిడిని తగ్గించుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం, తగినంత నిద్ర వంటికి జుట్టు ఆరోగ్యాన్ని ప్రోత్సాహిస్తాయి. అవసరమైన విటమిన్లు, ఖనిజాలు కలిగి ఉన్న ఉత్పత్తులు ఉపయోగించొచ్చు. తెలుపు రంగు జుట్టుని మార్చుకునేందుకు ఇంట్లోనే దొరికే వాటితో సింపుల్ చిట్కాలు పాటించి చూడండి. మీ జుట్టు నల్లగా నిగనిగలాడిపోతుంది.

కాఫీ- బ్రూ కాఫీ చేసుకుని అది చల్లారిన తర్వాత జుట్టుకి బాగా పట్టించాలి. గంట సేపు అలాగే ఉంచి ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి. కాఫీ జుట్టుకి ముదురు గోధుమ రంగుని ఇస్తుంది.

సేజ్- బాగా మరిగించిన సేజ్ టీ తీసుకోవాలి. అది చల్లారిన తర్వాత జుట్టుకి పెట్టుకుని గంటపాటు అలాగే ఉంచాలి. సేజ్ జుట్టుకి ముదురు గోధుమ రంగుని అందిస్తుంది.

చామంతి పూల టీ- చమోమిలే టీ ఆరోగ్యాన్ని మాత్రమే కాదు జుట్టుకి అందాన్ని ఇస్తుంది. టీ బాగా కాచి చల్లారిన తర్వాత జుట్టుకి పట్టించాలి. చామంతి పూల టీ జుట్టుకి లేత రంగుని అందిస్తుంది.

నల్ల వాల్ నట్స్- నల్ల వాల్ నట్ పెంకులను చూర్ణం చేసి వాటిని నీటిలో ఉడకబెట్టండి. దీన్ని చల్లారనిచ్చి జుట్టుకి పట్టించాలి. నలుపు వాల్ నట్స్ ముదురు గోధుమ రంగుని ఇస్తాయి.

క్యారెట్ రసం- క్యారెట్లు అందానికి, కళ్ళకు చాలా మంచిది. అలాగే ఇది జుట్టుకి కూడా పోషణ ఇస్తుంది. కొన్ని క్యారెట్ల ఉడకబెట్టి రసం చేసుకుని జుట్టుకి రాసుకోవాలి. ఇది ఎరుపు, నారింజ రంగుని ఇస్తుంది.

రబర్బ్- రబర్బ్ వేర్లను నీటిలో వేసి మరిగించుకోవాలి. దాన్ని జుట్టుకు పట్టించాలి. రబర్బ్ జుట్టుకి ఎరుపు, గోధుమ రంగులోకి మారుస్తుంది.

నిమ్మరసం- తాజా నిమ్మరసం జుట్టుకి రాసుకుంటే మంచిది. జుట్టుని మెరిసేలా చేస్తుంది. మంచి అందమైన రంగుని ఇస్తుంది.

హెన్నా- చాలా మంది ఫాలో అయ్యే సింపుల్ చిట్కా తలకి హెన్నా పెట్టుకోవడం. గోరింటాకు మెత్తగా నూరుకుని తలకు పెట్టుకుంటే.. జుట్టుకి కావాల్సిన పోషణ అందిస్తుంది. వెంట్రుకలు మృదువుగా మారేలా చేస్తుంది. తెల్ల జుట్టుని నల్లగా మారుస్తుంది. జుట్టుకు ఎరుపు, నారింజ రంగుని ఇస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version