పచ్చబొట్టు తుడిచేయొచ్చు.. ఇలా..

-

ఓ యువతి ఓ వ్యక్తిని ప్రేమించింది అనుకోండి. దీంతో అతడి పేరును ప్రేమతో పచ్చ బొట్టు వేయించుకుంటుంది. తర్వాత కొన్ని రోజులకు వాళ్లు విడిపోయారు అనుకుందాం. అప్పుడు పరిస్థితి ఏంటి. ఆ వ్యక్తి పేరును పచ్చ బొట్టు వేయించుకుంది కదా. దాన్ని తొలగించడం ఎలా..

టాటూస్ లేదా పచ్చబొట్లు.. టాటూ వేసుకోవడం అంటే అదో క్రేజీ. టూటూలకు ఎక్కువగా యూత్ అట్రాక్ట్ అవుతుంటారు. యువతులు కూడా టాటూలకు బానిసలే. అయితే.. ఈమధ్య టాటూలను తొలగించుకుంటున్నారట. అవును.. రివర్స్ ట్రెండ్ స్టార్ట్ అయిందట. అది కూడా ఎక్కడో కాదు. ఇండియాలో. ప్రపంచంలోనే అత్యధికంగా టాటూలను తొలగించే శస్త్రచికిత్సలు చేయించుకుంటున్న వారిలో భారత్ మొదటి స్థానంలో ఉందట.

2016 లెక్కలను ఓసారి చూస్తే అదే అనిపిస్తుంది. 22,860 మంది 2016 లో పచ్చ బొట్లను తొలగించే శస్త్రచికిత్సలను చేయించుకున్నారట. అసలు వాటిని వేయించుకోవడం ఎందుకు.. మళ్లీ తొలగించుకోవడం ఎందుకు అనే ప్రశ్న మీకు రావచ్చు. అయితే.. టాటూలు వేసుకోకముందు వాటిని వేసుకోవాలనిపిస్తుంది… వాటిని వేసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి.

సైడ్ ఎఫెక్టులు మాత్రమే కాదు.. ఒక్కోసారి పర్సనల్ సమస్యలు కూడా ఉంటాయి. ఉదాహరణకు ఓ యువతి ఓ వ్యక్తిని ప్రేమించింది అనుకోండి. దీంతో అతడి పేరును ప్రేమతో పచ్చ బొట్టు వేయించుకుంటుంది. తర్వాత కొన్ని రోజులకు వాళ్లు విడిపోయారు అనుకుందాం. అప్పుడు పరిస్థితి ఏంటి. ఆ వ్యక్తి పేరును పచ్చ బొట్టు వేయించుకుంది కదా. దాన్ని తొలగించుకోవడం కోసం ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్నారు. ఇండియాలో ఇలాంటి కేసులే ఎక్కువగా ఉన్నాయట.

అయితే మరికొందరు మాత్రం స్కిన్ ఎలర్జీ సమస్యలతో కూడా పచ్చబొట్లను తొలగించుకుంటున్నారట. ఇంకో విషయం ఏంటంటే.. పచ్చ బొట్టు ఉన్న వ్యక్తులకు కొన్ని కంపెనీలు ఉద్యోగాలు కూడా ఇవ్వడం లేదు. అది కూడా ఓ సమస్యే. పచ్చ బొట్ల వల్ల పెళ్లిళ్లు కూడా కావడం లేదంట. ఇదిగో.. ఇలాంటి సవాలక్ష సమస్యలతో ఉన్నవాళ్లు ఎందుకురా ఈ పచ్చబొట్టు బాధ అనుకొని.. దాన్ని తీసేసుకుంటున్నారట. ఈ విషయాలన్నింటినీ… ఇన్ఫోగ్రాఫిక్స్ అనే సంస్థ 2016 సంవత్సరానికి సంబంధించిన వివరాలను వెల్లడించింది.

2016 సంవత్సరంలో పచ్చబొట్లు చెరిపేసుకున్నవారిలో భారత్ నుంచి 22,860 మంది ఉండగా… జపాన్ నుంచి 20,159, అమెరికా 14,124, ఇటలీ 11,356, తైవాన్ 5,749, మెక్సికో 4,739, బ్రెజిల్ 4,290, టర్కీ 3,640, ఈజిప్ట్ 2,715 గా ఉన్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version