మెగా సందేశం.. కిక్ రాలేదన్న యంగ్‌ హీరో కార్తికేయ..!

-

కరోనా విలయ తాండవంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక హెచ్చరిక చేసిన నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి, యంగ్‌ హీరో కార్తికేయతో కలిసి ఒక అద్భుతమైన వీడియోను షేర్‌ చేశారు. కరోనా కట్టడికి మాస్క్ తప్పనిసరిగా ధరించండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీ కుటుంబాన్ని, దేశాన్ని కూడా కాపాడండి.. ప్లీజ్‌.. అంటూ ట్వీట్‌ చేశారు. చిరునవ్వు ముఖానికి అందం. కానీ ఆ చిరునవ్వు కలకాలం నిలవాలంటే.. మాస్క్‌ ధరించాలంటున్న చిరు ‘మెగా’ సందేశం అందరిని ఆకట్టుకుంటోంది.

అయితే దీనిపై కార్తికేయ స్పందిస్తూ.. తన ట్విట్టర్ లో ‘షూటింగ్‌ని మిస్ అవుతున్న సమయం, కరోనాతో ప్రస్తుతం నెలకొన్న భయం మధ్య తీసిన ఈ ఒక్క వీడియోతో భయాలన్నీ పోయాయి. ఓ మంచి పని కోసం మెగాస్టార్‌తో కలిసి ఈ వీడియో చేశాను. నా సినిమాలు పది విడుదలైనా ఈ కిక్ రాదు” అని ట్వీట్ చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version