వివాహిత మాట్లాడ‌టం లేద‌ని యువ‌కుడి ఆత్మ‌హ‌త్య‌..!

-

త‌న‌కు ప‌రిచ‌య‌మైన ఓ వివాహిత మాట్లాడ‌టం మానేసింద‌ని యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ లోని బోయిన్ ప‌ల్లి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. బ‌ల్కంపేట‌కు చెందిన దుర్గేష్ అనే యువుకుడు ఎల‌క్ట్రిషియ‌న్ గా విధులు నిర్వ‌హిస్తున్నాడు. అయితే అత‌డికి త‌న ప‌క్కింట్లో ఉండే మ‌హిళ‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. దాంతో త‌ర‌చూ ఆ మ‌హిల ఇంటికి వెళ్లి మాట్లాడుతూ ఉండేవాడు. ఈ క్ర‌మంలో స‌డెన్ గా ఆ మహిళ దుర్గేష్ తో మాట్లాడ‌టం మానేసింది.

దాంతో మ‌న‌స్థాపానికి లోనైన అత‌డు వివాహిత ఇంటికి వెళ్లి ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఇక త‌న కొడుకు మృతికి స‌దరు మ‌హిళే కార‌ణ‌మంటూ మృతిడి త‌ల్లి ఆరోపిస్తోంది. ఆమెను క‌ఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తోంది. బాధితుడి త‌ల్లి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version