యంగ్ టైగర్స్ ఫర్ టీడీపీ… లైన్ మారింది!

-

జాతీయ పార్టీ అని చెప్పుకునే టీడీపీ పరిస్థితి తెలంగాణ సంగతి కాసేపు పక్కన పెడితే… ఏపీ విషయానికొస్తే… ఏమిటీ పరిస్థితి… అనేది అందరి ప్రశ్న! ఇప్పుడు టీడీపీని నిజంగా ఆదుకునేది ఎవరు.. గట్టెక్కించేది ఎవరు అనే చర్చ మొదలైంది! అందులో భాగంగా… తెరపైకి మూడు పేర్లు వస్తున్నాయి.

అవును… ప్రస్తుతం చంద్రబాబుని కరోనా కంట్రోల్ చేసిన తరుణంలో.. ప్రతిపక్ష హోదా కూడా పోగొట్టుకుని ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టడానికి మనసంగీకరించని పరిస్థితులతోపాటుగా.. నడిపించే బలమైన ఉత్సాహవంతుడు కరువైన పరిస్థితి. ఈ పరిస్తితుల్లో మూడు పేర్లు తాజాగా తెరపైకి వచ్చాయని తెలుస్తుంది. వారిలో ప్రముఖంగా వినిపించే పేర్లు లోకేష్, జూ. ఎన్టీఆర్, రామ్మోహన్ నాయుడు. అయితే.. వీరి ఆర్డర్ మారుతుందని అంటున్నారు పార్టీ పెద్దలు!

టీడీపీ నాయకుల మెజారిటీ అభిప్రాయం జూనియర్ రావాలని కాగా.. బాబు అనుంగ శిష్యులు కూడా లోకేష్ కు ఓటు వేయడం లేదట. జూనియర్ రానిపక్షంలో రామ్మోహన్ నాయుడికే పెద్ద పీట వేయాలని కోరుతున్నారంట. ఈ క్రమంలో… యంగ్ టైగర్స్ ఆర్డర్ కాస్త జూ. ఎన్టీఆర్, రామ్మోహన్ నాయుడు, లోకేష్ అవుతుందని అంటున్నారు! ఈ లెక్కన చూసుకుంటే చినబాబుని బాబు ప్రియ మిత్రులు కూడా ఏమాతం అంగీకరించడం లేదని తెలుస్తోంది!!

– సి హెచ్. రాజా

Read more RELATED
Recommended to you

Exit mobile version